Agripedia

గుమ్మడి పూల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

గుమ్మడి పూలు చూడటానికి ప్రత్యేకంగా, ఆకర్షనియ్యంగా కనిపించే ఈ పూలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి, అంతేకాదు ఎన్నో సాంప్రదాయ వంటకాల్లో కూడా ఈ పూలు ఒక భాగం. మునపటి రోజుల్లో ఈ గుమ్మడి పూలను ఎన్నో విధాలుగా ఉపయోగించే వారు, కానీ ఇప్పుడు వీటికి ప్రాధ్యానత తగ్గిపోయింది. అయితే వీటిలోని ఆరోగ్య ప్రయోజాలను తెలుసుకుంటే, వీటిని ఇంక వదిలిపెట్టారు. గుమ్మడి పూలకు ఉన్న ఆహార మరియు ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి కుకుర్బిటేసియా అనే కుటుంబానికి చెందిన తీగజాతి మొక్కలు. గుమ్మడి కాయలకు ఆహార ఉపయోగాలతో పాటు, సాంస్కృతిక పరంగా కూడా ప్రాధాన్యత ఉంది. ఎన్నో పూజల్లో గుమ్మడి కాయలును ఉపయోగిస్తు ఉంటారు. గుమ్మడికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వీటి ఆకులు, కాయలు, విత్తనాలు మరియు పూలు ఇలా అన్ని భాగాలూ ఉపయోగకరమైనవే, అయితే విత్తనాలను మరియు కాయలను ఉపయోగిస్తారు కానీ, పూల వినియోగం చాలా తక్కువ. పూలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా గుమ్మడి పూలలో విటమిన్- ఏ అధికంగా ఉంటుంది. బీటా-కెరోటిన్ అనే సమ్మేళనం విటమిన్-ఏ కు మూలం. కంటి సమస్యలు ఉన్నవారు గుమ్మడిపులను తినడం ద్వారా ఆ సమస్యలు దూరం చేసుకోవచ్చు, అంతే కాకుండా విటమిన్-ఏ ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.

విటమిన్- ఏ తోపాటు గుమ్మడి పూలలో ఎంతో ముఖ్యమైన విటమిన్-సి ఉంటుంది. ఈ విటమిన్-సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడం, ఐరన్ శోషణను పెంచడం ఈ విటమిన్ యొక్క ప్రధాన లక్షణాలు. గుమ్మడి పూలలో విటమిన్లతో పాటు ఎన్నో రకాల ఖనిజాలు దాగి ఉన్నాయి. వాటిలో ఎముకల బలాన్ని మరియు కండరాల పనితీరును పెంచగల కాల్షియమ్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫోరస్ మొదలైన ఖనిజాలై ముఖ్యమైనవి. పొటాషియం మరియు సోడియం ఖనిజాలు గాయాలను తొందరగా నయమయ్యేలా చేసి మచ్చలు లేకుండా చేస్తాయి. అంతేకాకుండా కాల్షియమ్ మరియు పొటాషియం ఎక్కువుగా ఉన్నందున పురుషులలో వచ్చే లైంగిక సమస్యలను కూడా తగ్గించడంలో గుమ్మడి పూలు సహాయపడతాయి.

గుమ్మడి పూలలో ప్రత్యేకంగా బీటా-కెరోటిన్, ల్యూటిన్ మొదలైన కెరోటినోయిడ్లు ఉంటాయి, వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగివుండటం వలన శరీరంలోని కణాలకు మరియు డిఎన్ఏ కు జరిగే నష్టాన్ని తగ్గిచడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. వీటితోపాటు క్యూర్సీటిన్ వంటి ఫ్లవనోయిడ్స్ ఉండటం వలన కండరాల్లో వచ్చే వాపును తగ్గించడమే కాకుండా, యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కూడా ప్రదర్శిస్తాయి. గుమ్మడి పూలలో అధికంగా ఉండే ఆహారసంబంధిత ఫైబర్, జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలోని చెక్కర స్థాయిని పెంపొందిస్తుంది.

Share your comments

Subscribe Magazine