అడవిలో నివసించే గిరిజనులు తమ జీవనాన్ని కొనసాగించడానికి వివిధ రకాల ఉపాధిని చేస్తూ ఉంటారు. ఉదాహరణకు అడవిలో దొరికే కొన్ని సహజ వనరులను సీకరించి అమ్ముకుంటూ ఉంటారు. మరికొంత మంది గిరిజన ప్రజలైతే వెదురు మరియు ఇతర కలపతో బుట్టలు మరియు వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తారు. మరికొందరు అడవిలో చెట్లకు ఉన్న తేనెను సేకరించి అమ్ముతుంటారు. కానీ ఒక తండాకు చెందిన గిరిజన మహిళలు మాత్రం వారి కుటుంబాలను పోషించుకోవడానికి వినూత్నంగా ఆలోచించారు.
ఈ మహిళా బృందం అడవిలో నిమ్మగడ్డిని పండిస్తూ, వాటి నుండి సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర ఉత్పత్తులను తయారుచేస్తూ లాభాలు పొందుతున్నారు. మరియు ఈవిధంగా తయారు చేసిన ఈ నూనెలను ఒక అంతర్జాతీయ సంస్థతో మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఈ మహిళలు వనపర్తి జిల్లాకు చెందినవారు. ఇక్కడ మహిళలు కొన్ని సంఘాలుగా ఏర్పడ్డారు. కొన్నాళ్ల క్రితం ఈ జిల్లాకు చెందిన గ్రామాల్లో ఒక సంస్థ మహిళా సంఘాల కొరకు కొన్ని అవగాహన కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ మహిళలు ఈ లెమన్ గ్రాస్ సాగు గురించి తెలుసుకున్నారు.
ఈ మహిళలు తమ ఆలోచనలను అప్పటి కలెక్టర్కు చెప్పగా, ఆమె ప్రోత్సహించి వారికీ ఆర్ధికంగా సహాయం చేయడంతో సుగంధ ద్రవ్యాలను తయారు చేసే యూనిట్ ను ప్రారంభించారు. యూనిట్ ఏర్పాటుకు మొత్తానికి రూ.11.50 లక్షలు కాగా, 6.50 లక్షలు కలెక్టర్ నుండి సహాయం, రూ.2 లక్షలు సెరా సంస్థ నుండి సహాయం అందగా, మిగిలిన రూ.3 లక్షలు ఈ మహిళలు వేసుకుని యూనిట్ ప్రారంభించారు.
ఇది కూడా చదవండీ..
ఏపీ రైతులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మద్దతు ధరకు పప్పు ధాన్యాల కొనుగోలు
ఈ లెమన్ గ్రాస్ నుండి తయారు చేసిన ఈ నూనెకు చాలా డిమాండ్ ఉంది. ఎందుకనగా ఈ నూనెను షాంపూలు, సోప్స్, మరియు ఫేస్ క్రైమ్, వివిధ రకాల కాస్మోటిక్స్లో వినియోగిస్తారు. ఈ నూనెకు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది.లెమన్ గ్రాస్ నేనెకు మార్కెట్ ధర వచ్చేసి ఒక లీటర్ రూ.1,400 వరకు పలుకుతుంది. సుమారుగా ఒక టన్ను నిమ్మగడ్డి నుండి అరలీటర్ ఆయిల్ ను సేకరిస్తున్నట్లు మహిళలు తెలిపారు.
ప్రస్తుతం ఈ నిమ్మగడ్డి సాగు చుట్టుప్రక్కల గ్రామాలైన దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి రైతులు కూడా చేస్తున్నారు. సుమారుగా 80 నుండి 100 లీటర్ల నూనెను రెండునెలల ఒకసారి ఇక్కడ సేకరిస్తున్నారు. దీనితోపాటు నిమ్మగడ్డి సాగును మరింత విస్తరించే పనులు చేపడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన నూనెను మరియు ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.
ఇది కూడా చదవండీ..
Share your comments