Agripedia

అధిక దిగుబడినిచ్చే మేలైన బొప్పాయి రకాలు పూర్తి వివరాలు!

Srikanth B
Srikanth B
అధిక దిగుబడినిచ్చే మేలైన బొప్పాయి రకాలు పూర్తి వివరాలు!
అధిక దిగుబడినిచ్చే మేలైన బొప్పాయి రకాలు పూర్తి వివరాలు!

బొప్పాయి పండుని రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం గ పండిస్తారు, బొప్పాయి పండు సాధారణంగా సులభంగా పెరుగుతుంది అయినప్పటికీ ఈ మొక్కలని నాటేటప్పుడు మేలైన రకాలని ఎంచుకొవడం ఉత్తమం.బొప్పాయి లో గల మేలైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కూర్గ్ హనీ డ్యూ (Coorg Honey Dew):
ఈ రకం 'మధుబిందు'గా ప్రసిద్ధి చెందింది మరియు ఎక్కువగా టేబుల్ మరియు ప్రాసెసింగ్ ప్రయోజనం కోసం సాగు చేయబడుతుంది.
అధిక గుజ్జుతో మంచి రుచిని కలిగి ఉంటుంది.అద్భుతమైన పండ్ల నాణ్యత కారణంగా మార్కెట్ లో మంచి విలువను కలిగిఉంది.

పూసా డ్వార్ఫ్ (Pusa Dwarf):
ఈ రకం మొక్కలు పొట్టిగా ఉంటాయి. వీటి పండ్లు ఓవల్ ఒకటి నుండి రెండు కిలోల బరువులో ఉంటాయి. ఇది సాపేక్షంగా కరువును తట్టుకుంటుంది.తోటలో ఎక్కువ మొత్తంలో నాటడానికి ఈ రకం చాలా అనుకూలంగా ఉంటుంది.

పూసా జెయింట్ (Pusa Giant):
ఈ రకం మొక్కలు శక్తివంతమైనవి మరియు దృఢమైనవి మరియు బలమైన గాలిని తట్టుకోగలవు. ఇది పెద్ద-పరిమాణంలో రెండు నుండి మూడు కిలోల బరువును కలిగి ఉంటాయి వీటి పండ్లు క్యానింగ్ పరిశ్రమకు అనుకూలం.

తిరుమల శ్రీవారి ఆస్తి ఎన్ని లక్షల కోట్లు తెలుసా ?శ్వేతపత్రం విడుదల చేసిన TTD

పూసా మెజెస్టి (Pusa Majesty):
ఈ రకం ముఖ్యంగా నెమటోడ్‌లను తట్టుకుంటుంది.1.5 కిలోల బరువుతో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి, ఈ రకం పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ రకం ట్రాన్స్ ప్లాంట్ చేసిన 146 రోజుల నుండి ఫలాలు కాస్తాయి. పాపైన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి కొరకు ఎక్కువగా సాగు చేస్తారు.

పూసా డెలీషియస్ (Pusa Delicious):
ఇది మధ్యస్థ-పొడవైన మొక్కలతో కూడిన గైనోడియోసియస్ లైన్, నాటిన 8 నెలల తర్వాత దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది.
మంచి నాణ్యమైన పండ్లు (10°-13° బ్రిక్స్). పండు మధ్యస్థ పరిమాణంలో (1-2 కిలోలు) నారింజ రంగు గుజ్జుని కలిగి ఉంటుంది
అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

కో-1 (CO.1):
ఈ రకాన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.పండు మధ్యస్థ పరిమాణం, గోళాకారంలో ఉంటుంది మరియు మృదువైనది. ఎక్కువ రోజులు నిల్వ ఉండగలవు. పండ్లు అక్కుపచ్చ - పసుపు రంగులో ఉండి లోపల గుజ్జు నారింజ రంగులో ఉంటుంది.

తిరుమల శ్రీవారి ఆస్తి ఎన్ని లక్షల కోట్లు తెలుసా ?శ్వేతపత్రం విడుదల చేసిన TTD

Related Topics

Papaya Varieties

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More