బొప్పాయి పంట లో ఆకు చార ఈగలు పంట ను దెబ్బతీసి పళ్ళ దిగుబడిని చాలా తగ్గించే ప్రమాదం ఉంది.బొప్పాయి సాగు చేసే రైతులకు ఇవి పెద్ద సమస్య అనే చెప్పాలి . ముఖ్యం గా ,వానా కాలంలో ఆకుచార ఈగలు పంటను ఆశించి ఆకుల కింది భాగంలో గుడ్లు పెడతాయి.ఇక ఆకుల కణజాలాన్ని రంధ్రాలు చేసి తినేస్తాయి.
తర్వాత నల్లటి మలపదార్థాన్ని వదిలి పెద్ద తెల్లటి పాయలతో సొరంగాలు చేస్తాయి.ఈ ఈగలు పరిపక్వత చెందిన తర్వాత లార్వా ఆకు యొక్క దిగువ భాగంలో ఒక రంద్రం తెరిచి నేల మీదికి వెళ్తాయి.
ఈ ఆకు చార ఈగలు ఆశించిన మొక్కల ఆకులపై బూడిద రంగు చారలు ఏర్పడతాయి.తర్వాత ఆకులు వాడిపోయి రాలిపోతాయి.
దీనివల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.కాబట్టి ఈగలు పంటను ఆశించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.
బొప్పాయి( Papaya ) ఆకులు చుట్టుకునే రకాలు తెగుల నిరోధకతను కలిగి ఉంటాయి.కాబట్టి ఈ రకాలనే ఎంపిక చేసుకొని సాగు చేయాలి.పంట ఎదుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.ఆకుల పై భాగంలో సన్నటి దారం లాంటి చారలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించాలి.ఈ వ్యాధి సోకిన మొక్కలను పంట నుండి వేరు చేయాలి.ఎప్పటికప్పుడు కలుపును నివారిస్తూ ఉండాలి.
సేంద్రియ పద్ధతిలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనె( Neem oil )ను ఒక లీటరు నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిచేటట్లు పిచికారి చేయాలి.వేప నూనె ఆకుల్లోకి ప్రవేశించి స్వరంగ లోపల ఉండే లార్వాల వద్దకు చేరుకుంటుంది.
రసాయన పద్ధతిలో పిచికారి మందులను అధికంగా ఉపయోగిస్తే పంటకు సహాయంగా ఉండే కీటకాలు కూడా నశించే అవకాశం ఉంటుంది.ఈ కీటకాలు ఈ పురుగుల మందులకు నిరోధకతను కూడా పెంచుకుంటాయి.అబామెట్టిన్( Abamettine ), ఎసిటామి ప్రిడ్, స్పీనే టోరం, స్పైనోసాద్ లలో ఏదో ఒక దానిని వాడడం వల్ల కీటకాల నిరోధకతను పెంచుకోలేవు.
ఇది కూడా చదవండి
Share your comments