మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలోనూ అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే పంటలు పండించడంలో విభిన్నమైన పద్దతులను ఉపయోగించి రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఇలా విభిన్న పద్దతులలో సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడులు సాధిస్తూ.. అధిక ఆదాయం పొందుతున్నారు. అలాంటి పద్దతులలో గ్రీన్ హౌస్ లో కూరగాయలను సాగు చేయడం కూడా ఒకటి. గ్రీన్ హౌస్ లో పంటలు పండించడం అంటే చాలా మంది అదేదో ప్రత్యేకమైన పంటను మాత్రమే సాగు చేస్తారు అనే అభిప్రాయం చాలా మంది రైతుల్లో ఇప్పటికీ ఉంది. కానీ గ్రీన్ హౌస్ అనేది మొక్కలకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించే వ్యవస్థ. ఇందులో మొక్కలను సరైన విధంగా ఎరువులు, నీరు. వాతావరణ పరిస్థితుల కల్పన కారణంగా దిగుబడి పెరుగుతుంది.
అందుకే రైతులతో పాటు ఇంటి గార్డెన్ లో కూరగాయ మొక్కలను పెంచుకునే వారు గ్రీన్ హౌస్ పై మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ఇందులో అన్ని రకాల వాతావరణంలో పండించే మొక్కలను పెంచుకోవచ్చు. అయితే, గ్రీన్ హౌస్ లో కొన్ని రకాల కూరగాయాలను సాగు చేస్తే దిగుబడులు రికార్డు స్థాయిలో సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి టాప్ పంటల గురించి ఇప్పడుతు తెలుసుకుందాం..
గ్రీన్ హౌస్ సాగు ఉత్పత్తుల్లో అధిక దిగుబడులు వచ్చే పంటల్లో ఆకుకూరలు ఒకటి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలను పెంచవచ్చు. పంట నాణ్యత మెరుగ్గా ఉండటంతో పాటు దిగుబడి అధికంగా వస్తుంది. తాజాగా ఉంటాయి. మార్కెట్ లో లభించే ఇతర ఆకుకూరలతో పోలిస్తే వీటి ధర అధికంగానే పలుకుతుంది. అలాగే, అత్యంత ప్రజాదరణ పొందిన గ్రీన్ హౌస్ పంటలలో ఒకటి మిరియాలు. ఇవి పెరగడానికి తగినంత తేమ, ఉష్ణోగ్రత నియంత్రణ అవసరం. కాబట్టి స్వీట్ బెల్స్, జలపెనోస్, చిల్లీస్ రకాలకు చెందిన వాటిని గ్రీన్ హౌస్ తోటలో సాగు చేయవచ్చు. అలాగే, రకరకాల టమాటాలు పెంపకంతో దిగుబడి అధికంగా వస్తుంది. వివిధ రుచుల్లో తినడానికి అనుకూలంగా ఉంటే హైబ్రీడ్ దొస రకాలను గ్రీన్ హౌస్ పెంచడానికి అనుకూలంగా ఉంటాయి. దిగుబడి అధికం, మంచి రుచి, మార్కెట్ లో డిమాండ్ ధర వీటికి ఉంటుంది.
Share your comments