కొన్ని రకాల పళ్ళు కొన్ని కాలాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి వాటిలో మామిడి పండు ఒకటి. మామిడి పళ్ళు కేవలం, వేసవి కాలంలో మాత్రమే లభిస్తాయి. అయితే మామిడి పళ్ళను కెమికల్స్ సహాయంతో పండిస్తున్నారని వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారమవుతుంది. మందుల ద్వారా పండించే పళ్ళను తినడం ద్వారా చాల రకాల ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో దొరికే మంది పళ్ళు రసాయనాలు ద్వారా పండించారు లేదా సహజంగా పండినా అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
పూర్వం హానికారక రసాయనాలు అందుబాటులో లేని సమయంలో, మామిడి కాయలను ఎండుగడ్డితో మాగబెట్టేవారు. ఆలా సహజంగా పండిన మామిడి పళ్ళు తినడానికి పూర్తిగా సురక్షితం. అయితే ఈ బిజీ ప్రపంచంలో వ్యాపారస్తులకు టైం లేక, మరియు తక్కువ సమయంలోనే మామిడి పళ్ళు అమ్మి సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచనతో రసాయనాలను ఉపయోగించి మామిడి పళ్ళను పండిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంపట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండ, కేవలం స్వలాభం కోసం ఇలా హానికారక ఆహారాన్ని విక్రయిస్తున్నారు.
మందుల ద్వారా పండించిన మామిడి పళ్ళను గుర్తించడానికి ఒక బకెట్ నీటిని తీసుకుని దానిలో మామిడి పళ్ళను వెయ్యండి, పళ్ళు నీటిలో మునగకుండా పైకి తేలినట్లైతే అవి మందుల ద్వారా పండించినవి అని అర్ధం. సహజంగా పండిన మామిడి పళ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది కనుక అవి నీటిలో మునిగిపోతాయి. అలాగే మామిడి పండు రంగును చూసి కూడా అవి సహజంగా పండినా? కదా? అనే విష్యం కనిపెట్టవచ్చు. తొక్కపై భాగం అక్కడక్కడా ఇంకా పచ్చిగానే ఉంటె అవి రసాయనాలు ద్వారా పండించినవి అని గుర్తించవచ్చు. సహజంగా పండిన మామిడి పళ్ళు ఏకరీతలో పచ్చిగా లేదా పండి పసుపు రంగులో ఉంటాయి. రసాయనాల ద్వారా పండిన మామిడి పళ్ళ గుజ్జు లోపలి భాగం పచ్చిగా ఉంటుంది, పైభాగం మొత్తం ముగ్గినట్టు కనబడిన లోపల గుజ్జు మరియు టెంక భాగం పచ్చిగా ఉండటం గమనించవచ్చు.
మామిడి పళ్ళు కొనేటప్పుడు వాటితో పాటు హానికారక రసాయనాలను కూడా మోసుకువచ్చే అవకాశం ఉన్నందున, జాగ్రత్తగా చూసి కొనండి. పళ్ళను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత ఉప్పు నీటిలో ఒక రెండు నిమిషాలు ఉంచి తిరిగి, మంచి నీటితో కడగటం వలన, రసాయనాల ప్రభావాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు.
Share your comments