పార్కుల్లోనూ, ఇంటి ముందు చిన్న కాళీ స్థలంలోనూ పచ్చని గడ్డిని పెంచుకుంటే, కళ్ళకు ఇంపుగాను, మనసుకు ఆనందంగానూ ఉంటుంది. కుత్రిమంగా పెంచే కార్పెట్ గ్రాస్ కి ఈ మధ్య కాలంలో ఆధరణ బాగా పెరిగింది. ఈ కార్పెట్ గ్రాస్ ను ఇళ్ల ముందు, ఆఫీసుల్లో, మరియు ఇతర కాళీ ప్రదేశాల్లో పెంచడానికి అనువుగా ఉంటుంది. అయితే ఈ కార్పెట్ గ్రాస్ ఒకప్పుడు, పెద్ద భవనాలకు, హోటళ్లకు, మరియు పార్కులకు మాత్రమే పరిమితమై ఉండేది, దీని లభ్యత పెరగడంతో, ప్రజాధారణ బాగా పెరిగింది. మార్కెట్లో ఈ కార్పెట్ గ్రాస్ కు మంచి డిమాండ్ ఉండడంతో రైతాంగం కూడా దీని సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
కార్పెట్ గ్రాస్ ను ఒక ఎకరం విస్తీరణంలో సాగు చేసినట్లైతే, సుమారు 35 వేల షీట్ల గడ్డిని పెంచవచ్చు. మార్కెట్ ధరను బట్టి ఒక్కో షీట్ 6-8 రూపాయలకు వికృయిచుకోవచ్చు. ఈ కార్పెట్ గ్రాస్ ను ఆరు నెలలపాటు పెంచితే దాదాపు 2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా కొరియన్ కార్పెట్ గ్రాస్ కు భారీ డిమాండ్ ఉన్నది. మెట్రో నగరాల్లో స్టార్ హోటళ్లు, భారీ భవనాలు, పార్కులకు పచ్చదనమే ప్రాణం కాబట్టి వీటి వాడకం అనివార్యం. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల ప్రాంగణంలో 30 శాతం మేర పచ్చదనం ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉన్నది. ఫంక్షన్ హాళ్లు, ఏంటి పెరట్లతో పాటు ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాల్లోనూ గ్రీన్ కార్పెట్ వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో కొరియన్ గ్రాస్ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.
ఈ కొరియన్ గ్రాస్ గోల్డెన్ క్రాప గా పరిగణించబడుతుంది. ఈ షీట్స్ సాగు చెయ్యడానికి ఎక్కువ స్థలం అవసరం ఉండదు. ముందుగా పొలాన్ని చదును చేసి కలియదున్నాలి. ఆ తర్వాత భూమిఅంతా తడిసేలా నీళ్లు పెట్టి, మరోసారి దున్నాలి. ఆ తర్వాత భూమి మొత్తం సమానంగా ఉండేలా చూసుకోవాలి. గడ్డిని విత్తడానికి ముందే పశువుల పేడను ఎరువుగా వేయాలి. తర్వాత గ్రోమోర్, డీఏపీ లాంటి రసాయన ఎరువులను వేసుకోవాలి. ఆపైన కొరియన్ గ్రాస్ మొక్కలను బాగా కడిగి, నాటు మాదిరిగా వేసుకోవాలి. ఈ పంట సాగుకు నీటి అవసరం కూడా ఎక్కువ ఉండదు. చలికాలం, వర్షా కాలంలో వారానికి రెండుసార్లు నీళ్లు పడితే చాలు. ఎండాకాలంలోనైతే రెండురోజులు ఒకసారి నీళ్లు పట్టాల్సి ఉంటుంది. రైతులకు చీడపీడల బెడద ఉండదు. చెదలు వచ్చే ప్రమాదం మాత్రం లేకపోలేదు. చెదలు నివారణకు టిమెట్ మందులను కొడితే సరిపోతుంది. ఆరు నెలల తర్వాత పంట చేతికొస్తుంది.
Share your comments