మనం ఆహారంగా తినే ధాన్యం మరియు తృణధాన్యాలతో పాటు, కూరగాయలు కూడా ఎంతో అవసరం. కూరగాయల్లో మనకు అవసరమైన పోషకాలు అన్ని సంవృద్ధిగా లభిస్తాయి. మనదేశంలోని, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ మొదలగు రాష్ట్రాల్లో కూరగాయల సాగు విస్తృతంగా జరుగుతుంది. దాదాపు అన్ని సీసాన్ల లోను రైతులు కూరగాయలు సాగుచేస్తారు, కూరగాయల సాగుకు వర్షాకాలం అనుకూలమైనప్పటికీ, ఒక్కోసారి అధిక వర్షపాతాన్ని పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. రైతులు వర్షాకాలానికి తగ్గట్టు యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ నష్టాన్ని అధిగమించి మంచి లాభాలు పొందవచ్చు.
కూరగాయలు సాగుచేసే వారి బోదెలు లేదా బెడ్ల మీద వీటిని సాగు చెయ్యడం మంచిది, ఎత్తయిన బెడ్ల మీద కూరగాయలను సాగు చేస్తే మొక్కలు నీటమునిగే అవకాశం తక్కువగా ఉంటుంది, దీని వలన పొలంలో నీరు నిలిచినా అంత ప్రభావం ఉండదు. అధికంగా కురిసే వర్షాలకు పంటలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది, దీనిని నివారించడానికి వర్షాల కాస్త తగ్గగానే 19:19:19, లేదా 13:0:45 వంటి కాంప్లెక్స్ ఎరువులను మొక్క అవసరాన్ని బట్టి అందించాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే సూక్ష్మపోషక మిశ్రమాన్ని కూడా నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యొచ్చు.
ప్రస్తుతం వర్షాకాలం ఆరంభ దశలో ఉన్నాం, ఇటువంటి సమయంలో కూరగాయలు సాగుచేసే రైతులు మొక్కలను నర్సురిల నుండి కొనుగోలు చేయడం, లేదంటే రక్షిత వాతావరణంలో నారు మొక్కలను పెంచే ప్రయత్నం చెయ్యాలి, ఎందుకంటే అధిక వర్షాలకు ఒక్కసారి విత్తనం మొలకెత్తదు, మొలకెత్తిన మొక్కలు కూడా వర్షాలకు దెబ్బతినే అవకాశం ఉంది. ఎదిగే మొక్కలకు గాలికి పడిపోకుండా ఊతం ఇవ్వాలి, తీగజాతి మొక్కలు సాగుచేసే రైతులు పందిళ్లపై మొక్కలను పెంచాలి, లేదంటే మొక్కలు రోగాల భారిన పడే ప్రమాదం ఉంటుంది.
వర్షాకాలంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు పురుగులు మరియు సిలింద్రలు. మొక్కలను చీడపీడలు ఆశించడం ద్వారా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో ఆకుమచ్చ తెగులు, నారుకుళ్లు, ఎండు తెగులు, భుజు తెగులు, ఆకుతినే పురుగులు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్ది పురుగు, అలాగే దుంప జాతి మొక్కలో, దుంప కుళ్ళు మొదలైన వ్యాధులను ప్రధానంగా గమనించవచ్చు.
కూరగాయ మొక్కల్లో పురుగుల నివారణకు, వర్షాలు తగ్గిన వెంటనే క్లోరిఫైరిఫోస్ 2 మిల్లిలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము, ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి, మందులను మార్చిమార్చి వెయ్యాలి, లేదంటే పురుగులు ఈ మందులకు రెసిస్టన్స్ అబివృద్ధి చేసుకుంటాయి. అలాగే శిలింద్రాల్లో ఎండు తెగులు నివారణకు కాపర్ఆక్సీక్లోరైడ్ 3 గ్రా ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి, ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండజిమ్ 1 గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. భుజు తెగులు నివారణకు మెటలక్సీల్+ మాంకోజెబ్ 2గ్రా/లీ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. నెలలో తేమ ఎక్కువుగా ఉన్నపుడు సొలిసిక్ ఆసిడ్ 100 @ పి.పి.ఎం మొక్కలపై పిచికారీ చెయ్యడం ద్వారా మొక్కలు తిరిగి మాములు స్థితికి చేరుకొని పోషకాల వినియోగం పెరుగుతుంది.
Share your comments