Agripedia

ICMR: పప్పుదినుసులతో వంట చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రతలు ఇవే.....

KJ Staff
KJ Staff

మొక్కల ద్వారా లభించే ప్రోటీన్ పొందడానికి తృణధాన్యాలు ఒక చక్కటి వనరు. మనం సాధారంగా తినే పప్పుదినుసుల్లో, మినప్పప్పు, పెసరపప్పు, కంది పప్పు, సెనగపప్పు వంటివి ముఖ్యమైనవి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుంటాం. అయితే వీటితో వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 17 మార్గదర్శకాలతో కూడిన ఒక నివేదిక విడుదల చేసింది.

తృణధాన్యాల్లో ప్రోటీన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటితో వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది, లేకుంటే ఈ పోషకాలు అన్ని పోయే అవకాశం ఉంటుందని ఐసిఎంఆర్ తెలిపింది, వీటిని వండే సమయంలో పాటించవలసి జాగ్రత్తల గురించి ఒక నివేదిక కూడా విదుదల చేసింది.

పప్పుదినుసులు ఉడకబెట్టడం, లేకుంటే బాయిల్ చెయ్యడం ఉత్తమమని ఐసీఎంఆర్ పేర్కొంది. వీటిని ఊడబెట్టడం ద్వారా వీటిలోని పోషక వ్యతిరేక కారకాలైన పైటిక్ ఆసిడ్స్ వంటివి తగ్గుతాయని తెలిపింది, ఫైటిక్ ఆసిడ్స్ అనేవి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు శరీరంలో కలవకుండా ఉండేందుకు తోడ్పడతాయి. వీటిని ఉడకబెట్టడం ద్వారా వీటిలోని కొన్ని మినిరల్స్ అందుబాటులోకి వచ్చి మరింత మేలును చేకూరుస్తాయి. అయితే పప్పుదినిసులను అవసరమైన దానికంటే ఎక్కువ ఉడకబెట్టిన లేదంటే ప్రెషర్ బొయిలింగ్ చేసిన, వాటిలోని ప్రోటీన్ మరియు పోషకాలు శాతం తగ్గి, శరీరానికి ఎటువంటి ఉపయోగం లేకుండా మారతాయి.

ఎక్కువుగా బాయిల్ చేయడం ద్వారా కలిగే దుష్ప్రాభవాలు:

 

ప్రోటీన్ల శాతం తగ్గిపోవడం:

ప్రోటీన్లు ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ప్రోటీన్ మూలకాలైన పెప్టైడ్ గొలుసులు మధ్య హైడ్రోజన్ బంధాలు చెదిరిపోయి, ప్రోటీన్లు విచ్చిన్నమవుతాయి దీనినే దేనాటురషన్ అని పిలుస్తారు. తృణధాన్యాలు ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రత వద్ద బాయిల్ చేసినట్లైతే వాటిలోని ప్రోటీన్లు విచినంకావడానికి ఆస్కారం ఉంది.

విటమిన్ల నష్టం:

ఆహార పదార్ధాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉన్నపుడు వాటిలో వేడిని తట్టుకోలేని విటమిన్-బి, సి నష్టపోయే అవకాశం ఉంటుంది, దీనివలన విటమిన్ల లోపం ఏర్పడవచ్చు.

అమైనో ఆమ్లాలు నాశనం కావడం:

ప్రోటీన్లు ఏర్పడటానికి ప్రధాన కారణం ఈ అమైనో ఆమ్లాలు. ఈ అమైనో ఆమ్లాలు గొలుసులుగా ఏర్పడి, ప్రోటీన్లను తయారుచేస్తాయి. మన శరీరంలో ప్రోటీన్లు తయారుకావడంలో కూడా అమైనో ఆమ్లాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ అమైనో ఆమ్లాలు నష్టపోయే అవకాశం ఉంటుంది.

ఆకృతి మరియు రుచిలో వ్యత్యాసం కలగడం:

పప్పుదినుసులను ఎక్కువ సమయం అధిక ఉష్ణోగ్రత వద్ద వండటం వలన పోషకాలు శాతం తగ్గిపోవడంతో పాటు, పప్పుల ఆకృతిలో మార్పు వచ్చి ముద్దగా తయారవుతాయి. వీటిని తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.

అయితే వీటిని ఏవిధంగా మరియు ఎంతసేపు వండాలన్న విషయాని ఐసిఎంఆర్ స్పష్టం చేసింది. కందులు మరియు బఠాణీలు వంటివాటిని 20-30 నిమిషాల లోపు వండాలి అలాగే బీన్స్ మరియు సెనగలు వంటి పదార్ధాలను వంట చేసే ముందు 30-40 నిమిషాలు నానబెట్టిన తరువాత, 60-90 నిమిషాల లోపు వంట పూర్తిచెయ్యాలి, దీని ద్వారా వాటిలోని పోషకవిలువలు నశించవని ఐసీఎంఆర్ పేర్కొంది. తృణధాన్యాలను వండటానికి ఒక కప్పు పప్పుకి 3-4 గ్లాసుల నీటిని ఉపయోగించాలని, ప్రెషర్ కుక్కర్లో వంట చెయ్యడానికి 2-3 కప్పుల నీటిని ఉపయోగించాలని సూచించారు.

Share your comments

Subscribe Magazine