Agripedia

ఎత్తుమడుల మీద పంటను నాటుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు.....

KJ Staff
KJ Staff

ఇప్పటివరకు సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపాడు. భరించలేని ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లకల్లోలం అవుతున్న వేళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చేరి, వర్షాలను కురిపిస్తూ, ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. ఎల్-నినో ప్రభావం కారణంగా ఇప్పటివరకు ఎండలు భీభత్సంగా ఉన్నాయి, ఇప్పటినుండి లానిన ప్రారంభం కానున్నది, దీని ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

అధిక వర్షాల కారణంగా ప్రజలకు మేలు జరిగిన, ఒక్కోసారి ఆ వర్షాలే కీడు కూడా కలిగించవచ్చు. వర్షాల కారణంగా పొలాలు ముంపుకు గురైతే భారీ పంట నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి రైతులు సంసిద్ధంగా ఉండాలి. ఎత్తుమడులు లేదా రైజ్డ్ బెడ్స్ మీద సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎర్ర నేల లేదా నల్ల నేల ఇలా నేల రకం ఏదైనా కానీ ఎత్తుమడులు మీద సాగు చెయ్యడానికి ఆస్కారం ఉంటుంది. పత్తి, కంది, మిర్చి, పసుపు, సొయా, వేరుశెనగ, మరియు కూరగాయ పంటలు ఇలా ఎన్నో రకాల పంటలను ఎత్తుమడుల మీద సాగుచెయ్యడానికి అనుకూలంగా ఉంటుంది.

వర్షాలు అతివృష్టిగా కురిసే సమయంలో పొలం మొత్తం నీరు నిలిచిపోతుంది, ఎత్తుమడుల్లో పంటలను సాగు చెయ్యడం ద్వారా అదనపు నీటిని బోదెల ద్వారా బయటకి పంపించచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే కాండం కుళ్ళు తెగులు మరియు వేరు కుళ్ళు తెగులును కూడా రాకుండా నివారించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఎత్తుమడుల్లో నాటిన విత్తనం తొందరగా మొలకెత్తడమే కాకుండా విత్తన మొలకెత్తే శాతం కూడా ఎన్నో రేట్లు పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఎత్తుమడుల్లో నాటిన విత్తనాల్లో సుమారు 90% వరకు మొలకెత్తేందుకు వీలుంటుంది.

ఈ ఎత్తుమడులు పంటకు తగ్గట్టుగా తయారుచేసుకోవాలి, వీటిని రిడ్జెర్ లేదా బెడ్ మేకర్ సహాయంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ బెడ్లను 15-20 సెంటీమీటర్ల ఎత్తులో, 13-180 సెంటీమీటర్ల సాళ్ల దూరంలో నిర్మించుకోవాలి, పంట రకాన్ని బట్టి విత్తన దూరం ఉంటుంది. ఒక ఎకరంలో ట్రాక్టర్ సహాయంతో వీటిని నిర్మించడానికి దాదాపు 45-60 నిమిషాల సమయం పడుతుంది. ఎత్తుమడుల మీద సాగు చేయడం ద్వారా మట్టి ద్వారా కాయలకు వచ్చే రోగాలను అరికట్టవచ్చు మరియు కాయకుల్లు మరియు కాండం కుళ్ళు వంటి తెగుళ్లను రాకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా ఈ పద్దతిలో సాగు చెయ్యడం ద్వారా 10-20 శాతం దిగుబడులు పెరిగినట్టు రైతులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine