Agripedia

రాగిలో అధిక దిగుబడిని అందించే కొత్త రకం - 'ఇంద్రావతి'

Gokavarapu siva
Gokavarapu siva

రాగి పంట అనేది మన భారతదేశంలో ముఖ్యమైన తృణిధాన్యం. ఈ రాగి పంట ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలో పండిస్తారు. సాధారణంగా వివిధ రకాలు అయినా మారుతీ, కళ్యాణి, గోదావరి రాగులతో దిగుబడి ఎక్కువగా రాకపోవడంతో చింతపల్లికి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు 'ఇంద్రావతి' అనే అధిక దిగుబయిని ఇచ్చే రకాన్ని రైతుల కొరకు తీసుకువచ్చారు. ఈ ఇంద్రావతి రకం అదేజిక పోషక విలువలను కలిగి ఉంటుంది. అదేవిధంగా రైతులకు అధిక దిగుబడులను అందించి వారిని ఆర్ధికంగా నిలదొక్కుకునేలా సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఱగి సాగును పెంచడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విత్తనాలను ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసింది.

దేశివాలి విత్తనాలు వాడటం వలన రైతులకు అధిక దిగుబడి రావడం లేదు, అది అలా ఉండగా నాణ్యమైన విత్తనాలు దొరకకపోవడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. దీనివల్ల రాగి పంట సాగు తగ్గిపోయింది. పాడేరు డిబిషన్లో గతంలో 20 వేల హెక్టర్లలో రాగి సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం ఇది 18,176 వేళా హెక్టర్లకు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఱగి సాగు యొక్క విస్తీర్ణతను పెంచడానికి ఇంధ్రావతి విధానాలను అక్కడ ప్రాంత రైతులకు ప్రభుత్వం అందచేసింది. ట్రయల్ విధానంగా శాస్త్రవేత్తలు ఈ విధానాలను 10 మంది రైతుల చేత సాగు చేయించారు. ఈ పంట నుండి దిగుబడులు అధికంగా రావడం గమనించారు. ఈ రకం యొక్క విత్తనాలను ఎక్కువ మంది రైతులకు అందచేసే విధిగా విత్తనాభివృద్ధి చేసి రైతులకు అందచేస్తా అన్నారు.

నేడు రాగి మరియు రాగి ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. సాధారణ రకాలతో అధిక డిజిటబడిని రాకపోవడంతో చింతపల్లికి చెందిన శాస్త్రవేత్తలు విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ ఇంద్రావతి అభివృద్ధి చేసారు. ఈ వంగడంపై అనేక విహడలుగా పరీక్షలు చేసి, నాట్లకు అత్యంత అనుకూలమైనవి అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంద్రావతి రకం పంట 115 నుండి 120 రోజుల్లో చేతికి వస్తుంది. మరియు ఇది ఎకరానికి 14 నుండి 15 క్విన్టళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఈ ఇంద్రావతి రకంను సాగు చేయడం వాలన ఱగి పంటలో వచ్చే ముఖ్య సమస్య అయినా అగ్గి తెగులును తట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి..

ఆధునిక పద్దతిలో జొన్న సాగు

ప్రస్తుతం ఈ చిరుధాన్యాల ప్రాముఖ్యత ప్రజలకు బాగా తెలిసింది. ఈ చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఈ రాగులను ఆహారంగా తినడం వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇవి చిన్నపిల్లకు గర్భిణికాలు చాల మంచిది. ఈ ఇన్ధత్రావతి రాగిలో ఎక్కువ ఐరన్ ను కలిగి ఉంటుంది. దానిటఁజూ పాటు అనేక పోషకాలు కూడా లభిస్తాయి.

ఇది కూడా చదవండి..

ఆధునిక పద్దతిలో జొన్న సాగు

Related Topics

indhravathi finger millet

Share your comments

Subscribe Magazine