Agripedia

వేరుశనగని ఆశించే కీటకాలు, వాటి యాజమాన్యం !

Srikanth B
Srikanth B
వేరుశనగని ఆశించే కీటకాలు, వాటి యాజమాన్యం !
వేరుశనగని ఆశించే కీటకాలు, వాటి యాజమాన్యం !

వేరు పురుగు : పెంట కుప్పలు పంట చేలకు దగ్గరగాఉన్నపుడు. అలాగే. పూర్తిగా మురగని పశువులఎరువును పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. తొలిదశ లద్దె పురుగులు తెలుపు రంగులో |5 మి.మీ పొడవు, 'సి' ఆకారంలో ఉండి రాత్రిసమయంలో భూమి లోపల మొక్కల భాగాలనికత్తిరించి తింటాయి. పురుగు ఆశించిన మొక్కలను లాగితే సులభంగా ఊడి వస్తాయి. పురుగు వల్ల మొక్కలు.వాడిపోయి, ఎండిపోయి. చివరకిచనిపోతాయి. వర్షం ప్రారంభమైన 3-4 రోజులతర్వాత రెక్కలపురుగులు నేల నుండిబయటపడతాయి.

నివారణ:

  • ఈ వేసవిలో లోతుగా దుక్కులు దున్నుకోవాలి. ఎందుకంటేబయటకొచ్చిన లద్దెపురుగులను పక్షులు తిని నాశనం చేస్తాయి.
  •  పంట చుట్టూ ఉన్న కలుపు మొక్కలను నాశనంచెయ్యాలి.
  • మట్టిలోని తేమ సరిపోని స్థితిలో లద్దెపురుగులు దాడి ఎక్కువగా. చేస్తాయి కాబట్టి పంటకు తగిననీటిపారుదల ఉండేలా చూసుకోవాలి.
  •  ఫోరేటు 10% గుళికలను ఎకరాకు 6 కిలోలు చొప్పునఇసుకలో కలిపి చల్లుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే హెక్టారుకిథయామెథోక్సామ్‌ 25 డబ్యూ,ఎస్‌. 1.9 లీటర్లు లేదాఫిప్రోనిల్‌ 5 ఎఫ్‌.ఎస్‌. 2 లీటర్లు పిచికారీ చెయ్యాలి.
  • పేనుబంక : వేరుశనగ అత్యంత తీవ్రమైన కీటకాల్లో ఇదిఒకటి. పంట విత్తిన 4-6 వారాల తరువాత పేనుబంకఆశిస్తుంది. శీతాకాలం తర్వాత అవి తాజాగా మొలకెత్తినవేరుశనగ మొక్కలకు చేరుతాయి. పురుగులు ఆకులఅడుగున చేరి రసాన్ని పీల్చటం వలన ప్రారంభ దశలోఆకులు పసుపు రంగులో మారి చివరిదశలో మొక్కలు కుంగిపోయి, నీరసించి గిడసబారతాయి. పురుగు ఉధృతిఎక్కువగా ఉంటే మొక్కలు చనిపోయి దిగుబడి గణనీయంగా.తగ్గుతుంది. ఆకులు పై పేనుబంక తియ్యటి పదార్థాన్ని వినర్జించటం వలన నల్లగా మసివూసినట్లుగామారిపోతాయి.

తియ్యటి వదార్శానికి చీమలు ఆకర్షింపబడతాయి. వ్యాధి కారక వైరస్‌ లకు పేనుబంక వాహకాలుగా పనిచేస్తాయి.

నివారణ:

పంట ఆలస్యంగా విత్తడం మానుకోవాలి.ముందు జాగ్రత్త చర్యగా కేజి విత్తనానికి ఇమిడాక్తోప్రిడ్‌(5 మి.లీ) లేదా థయోమిథక్సాం (7 మి.లీ) కీటక నాశినిలతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఎకరానికి ఆక్సిదెవెటన్‌ -మిథైైల్‌ 500 మి.లీ. లేదా ఇమిడాక్సోప్రిడ్‌ 500 మి.లీ లేదా బుప్రోఫెజిన్‌ 300మి.లీతో పిచికారీ చేయాలి.

ఎరుపు వెంట్రుకల గొంగళి పురుగు : వర్షాధార వేరుశనగపంటలో తీవ్రమైన, వినాశకరమైన పురుగు ఇది. పురుగువ్యాప్తి ఎక్కువగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడిఉంటుంది. గుడ్ల నుండి బయటకొచ్చిన పురుగులు ఆకులనిఆశించి నష్టపరుస్తాయి. అవి పెరిగేకొద్దీ ఆకులను తినడంవల్ల ఆకుల ఈనెలు మాత్రమే మిగులుతాయి.

 

  • జొన్న మొక్కజొన్న సజ్జలు వంటి పంటలతో పంట మార్చిడి చెయ్యాలి.
  • వేసవిలో లోతుగా దుక్కులు దున్నుకోవాలి. ఎందుకంటేబయటకొచ్చిన లద్దెపురుగులను పక్షులు తిని నాశనం
  • చేస్తాయి.
  • ప్రారంభ దశలోనే  గుడ్లను ను ఏరి నాశనం చేయాలి.

పుట్టగొడుగు విత్తనం ( స్పాన్) తయారీ విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు...

Share your comments

Subscribe Magazine