Agripedia

సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో తెలుసుకుందాం రండి....

KJ Staff
KJ Staff

స్వీట్లంటే ఇష్టం ఉన్నవారికి సగ్గుబియ్యం గురించి తెలియకుండా ఉండదు. ఎన్నో పండగల్లో ఈ సగ్గుబియ్యం ఒక భాగం. పండగ సమయాల్లో ఉపవాస దీక్ష చేపట్టేవారు, సాగుబియ్యంతో చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే సగ్గుబియ్యం శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చెయ్యగలదు,అంతేకూండా వీటితో చేసిన వంటకాలు తింటే పొట్టలో తేలికగా కూడా ఉంటుంది. వీటితో ఎన్నో రకాల వనతలా చేస్తారు వాటిలో, ఖీర్, వడియాలు, ఉప్మా ఇలా ఎన్నో వంటకాలు ఉన్నాయి.

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియమ్, మరియు ఐరన్ పుష్కలంగా లభిస్తాయి, శరీరానికి కావాల్సిన శక్తిని అధించగలిగే సామర్ధ్యం సగ్గుబియ్యానికి ఉంది, ఇందువలన ఉపవాసం ఉండేవారు వీటిని తినడానికి మొగ్గుచూపుతారు. ఈ సగ్గుబియ్యాని కాస్సావ అనే మొక్క వేర్ల నుండి తయారుచేస్తారు, కాస్సావ మొక్కను కర్రపెండలం అనికూడా పిలుస్తారు. వీటిని ఎక్కువుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లోని రైతులు పండిస్తారు. అయితే ఈ మొక్క భారత దేశానికి చెందినది కాదు, కొన్ని కథనాల ప్రకారం, ట్రావన్కోర్ రాజ్యాన్ని పాలించిన అయినాల్ తిరుణాల్ రామ వర్మ అనే రాజు, 1860 లో మొదటిసారి ఈ మొక్కను మన దేశానికి పరిచయం చేసినట్లు చెబుతారు. అప్పట్లో ట్రావన్కోర్ రాజ్యములో కరువు సంభవించినప్పుడు, రాజు తన ప్రజలను ఆహార బాధల నుండి కాపాడటానికి తన తమ్ముడి సహాయంతో, బ్రెజిల్ నుండి ఈ మొక్కలను మన దేశానికి రప్పించినట్లు కథనాలు ఉన్నాయి.

మరికొందరేమో పోర్త్యుగీస్ వారు 17 వ శతాబ్దంలో మొట్టమొదటిసారి భారత దేశానికి వచ్చినప్పుడు ఈ కాస్సావ మొక్కను ఇండియాకు పరిచియం చేసినట్లు చెబుతారు. ఏది ఏమైనప్పటికి పరిచయమైనప్పటి నుండి ఇప్పటివారు, సగ్గుబియ్యానికి మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత లభించింది. అతికొద్ది కాలంలోనే మన భారతియా వంటకాక్లో ఒక భాగమైపోయింది. సగ్గుబియ్యం మన దేశంలోనే కాకుండా ఎన్నో దేశాల్లో పరచుర్యం ఉంది. ఆఫ్రికా వంటి దేశాల్లో వీటిని ఎక్కుగా పండిస్తారు, అంతేకాదు అక్కడి ప్రజలకు ఇదే ప్రధానాహారం.

అయితే ఈ సగ్గుబియ్యం ఎలా తయారుచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సగ్గుబియ్యాని తయారుచెయ్యడనికి కర్రపెండలం మొక్క యొక్క వేర్లు ప్రధానం, కాస్సావ మొక్క యొక్క వేర్లు దుంపల ఆకృతిని కలిగిఉంటాయి. ఏవి బాగా ఎదిగిన తరువాత ఫ్యాక్టరీలకు తరలిస్తారు అక్కడ వీటిని బాగా కడిగి పైన ఉన్న చర్మాన్ని తొలగిస్తారు. ఇప్పుడు వీటిని గ్రైండర్ ద్వారా పంపించి ముద్ద లాగా తయారుచేస్తారు. ఇలా ముద్దలాగా ఉన్న మిశ్రమాన్ని ఫిల్టర్ల ద్వారా పంపించి, గుజ్జును నీటిని వేరు చేస్తారు. ఇలా చెయ్యడం ద్వారా తెల్లని పాలవంటి నీరు వేరవుతుంది, ఈ నీటిని సూర్యరశ్మిలో లేదంటే ఓవెన్లో ఆరబెట్టి, నీరు కాస్త ఆరిన తరువాత చిక్కాల ద్వారా పంపిస్తారు, దీని ద్వారా తెల్లని ముత్యాల ఆకృతి కలిగిన సగ్గుబియ్యం తయారవుతాయి.

Share your comments

Subscribe Magazine