Agripedia

మిరపలో నారుకుళ్ళు తెగులు యాజమాన్య పద్ధతులు

KJ Staff
KJ Staff

మిరప (క్యాప్సికమ్ యాన్యుమ్ ఎల్.)  దీనినే ఎర్ర మిరప అని కూడా అంటారు.ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. ఈ పంట అనేక రకాలయిన వ్యాధుల బారిన పడుతుంది దీని వలన సాగుదారులకు ఎక్కువ నష్టానికి దారితీస్తుంది. దీనికి పైథియం అఫనిడెర్మాటమ్ అనే జివి కారణం ఇది 90 శాతం వరకు మొక్కలను  చంపేస్తుంది. రైతులు నారుమడి తయారు చేసే క్రమంలో జగ్రత్తలు తీసుకోకపోవడం వలన మరియు నారుమడిలో నీరు నిల్వ ఉండడం ద్వారా మొక్కలు చనిపోవడం జరుగుతుంది. తెలంగాణ లో ఈ సంవత్సరం ఎక్కువ వర్షపాతం నమోదు అవడం ద్వారా ఇంక ఎక్కువ నష్టం చేకూరుతుంది.  ఇలా నారుమడిలో మొక్కలు చనిపోకుండా ఉండలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు వాడడం ఎంతయినా అవసరం ఉంది.

లక్షణాలు: లేత మొలకల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. కొన్నిమొలకలు ఆవిర్భావానికి ముందే చనిపోబడతయి. వ్యాధి ప్రభావిత విత్తనాలు లేత గోధుమ రంగులో కనిపిస్తయి. విత్తనాలు మరియు నేల ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది. కాండం బలహీనపడటం వల్ల మొలకలు వంగిపోవడం మరియు కుళ్ళి పోవడం జరుగుతుంది.

 సంక్రమణకు అనుకూలంగా ఉండే కారకాలు: తేమ నేలలు ఉండటం.  90-100 శాతం సాపేక్ష ఆర్ద్రత మరియు 18 - 20 డిగ్రీ సెలీసియస్ ఉష్ణోగ్రత.

సస్యరక్షణ:

నారుమడి నిర్వహణ లో తగిన జగ్రత్తలు తీసుకుంటే, నరుకుళ్లు తెగులును నివారించవచ్చును. నారుమడి స్థాపన కోసం నీడ స్థలాలను నివారించాలి. సిఫార్సు చేసిన విత్తన రేటును ఉపయోగించాలి. నీటిపారుదల రకాన్ని నివారించాలి మరియు నారుమడిలో వాంఛనీయ తేమ స్థాయిని నిర్వహించాలి.

విత్తన శుద్ధి: కిలో మిరప విత్తనానికి మొదటగా తెగుళ్ల నివారణకుగాను 3 గ్రాముల కాప్టెన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.

నారుమడి యాజమాన్యం: ఎకరానికి 10 టన్నుల ఎరువు వేయాలి. ఒక మీటరు వెడల్పు, 15 సెం. మీ. ఎత్తు ఉండేటట్లు ఎత్తయిన నారుమడులు చేసి మధ్యలో 30 సెం. మీ. కాలువలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం చల్లుకోవాలి. అలాగే సెంటుకు 1 కిలో వేప పిండి వేయాలి. ఒక శాతం బోర్డిమిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటిలో కలిపిన నీళ్లతో నారుమడిని 9 వ రోజు, 13 వ రోజు తడపాలి. ఆరు వారాల వయసు గల మొక్కలను నాటువేసుకోవాల.

రసాయనిక ఎరువులు: నారుకుళ్ళు తెగులు లక్షణాలు ఉన్న మొలకలు గుర్థించిన వెంటనే దీని నివారణకు విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, మరల వారంరోజులకు ఒకసారి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి లేదా 1 శాతం బోర్డిమిశ్రమంతో పిచికారీ చేయాలి.

జీవన ఎరువులు: విత్తన శుద్ధి కోసం ముందు ట్రైకోడెర్మా వైరైడ్ 4 గ్రాముల ఒక కిలో విత్తనం చొప్పున కలుపుకోవాలి లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు ఒక కిలో విత్తనంలో కలిపి 24 గంటల ముందు శుద్ధి చేసుకోవాలి. అలాగే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ని 2.5 కిలోల చొప్పున ఒక హెక్టారుకు 50 కిలోల వ్యవసాయ యార్డ్ ఎరువు మట్టిలో కలుపుకొని నారు మార్పిడి చేసేటపుడు వేసుకోవాలి. 

బానోతు శివ మరియు జె. వంశీ, పీహెచ్డీ  స్కాలర్స్

సెల్: 9502071054

Share your comments

Subscribe Magazine