Agripedia

"చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి"- డాక్టర్ మల్లం మహేందర్

Srikanth B
Srikanth B
చిరు ధాన్యాల సాగు అవగాహన  కార్యక్రమం లో రైతులు
చిరు ధాన్యాల సాగు అవగాహన కార్యక్రమం లో రైతులు

18-03-2023 శనివారం వరంగల్ జిల్లా మామునూర్ లోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు కార్యక్రమాన్ని జిల్లాలోని వివిధ గ్రామాల రైతులకు తెలియజేసే విధంగా దృశ్య మాధ్యమంలో అవగాహన కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ విస్తరణ అధికారి డాక్టర్ మల్లం మహేందర్ పాల్గొన్నారు .


డాక్టర్ మహేందర్ విస్తరణాధికారి మరియు కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న కృషి విజ్ఞాన్ కేంద్ర శాస్త్రవేత్తలు కలిసి రైతులకు చిరుధాన్యాల ప్రాధాన్యత గురించి వివరించారు . అనంతరం డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యానికి హానికరమైన ఆహారాలవాట్లను దూరం చేసి పకృతి పరమైనటువంటి చిరుధాన్యాలు మానవ మనుగడకు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరమని ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు భారీగా డిమాండ్ ఉందని అందుకే భారత ప్రభుత్వ చొరవతో ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు అని కావున రైతులు చిరుధాన్య పంటల సాగు వైపు మొగ్గు చూపాలని అన్నారు .

వరి పంటలకు ఎకరానికి 45 వేలు రుణం ..

అనంతరం కృషి విజ్ఞాన్ కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న మాట్లాడుతూ పూర్వకాలంలో భారత దేశంలో వినియోగించిన ఆహారపు అలవాట్లు కొనసాగించడం మన అందరి కర్తవ్యం అని అలవాట్లతో పూర్వావికులు ఎంతో ఆరోగ్యంగా శారీరకంగా దృఢంగా ఉండేవారని పరిస్థితులలో ప్రకృతి పరమైన ఆహార అలవాట్లు అవలంబించాలని అన్నారు, చిరుధాన్యాల వ్యాపార ఉత్పత్తులలో అధిక లాభాలు సాధించవచ్చు అని మహిళలు ఉత్పత్తి ఆధారత విలువైన చిరుధాన్యాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలుడాక్టర్ సౌమ్య, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ రాజు,డాక్టర్ గణేష్,డాక్టర్ శశాంక్,డాక్టర్ సాయి కిరణ్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు పాల్గొన్నారు.

వరి పంటలకు ఎకరానికి 45 వేలు రుణం ..

Related Topics

benefitsof millets

Share your comments

Subscribe Magazine