Agripedia

రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం...

Srikanth B
Srikanth B
farmer loan at lowest interest
farmer loan at lowest interest

రైతులకు తక్కువ వడ్డీ రేటు రుణాలను అందించడానికి, ఒక జాతీయ బ్యాంకుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మీద వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్‌ఏ) సంతకం చేసింది.

ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌ల (ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్‌) మీద సున్నా ప్రాసెసింగ్ రుసుముతో, అదనపు తనఖా & అధిక వడ్డీ రేట్లు లేకుండా 'ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ రుణాలు' పేరిట ప్రత్యేకంగా జారీ చేసే కొత్త రుణాల మీద అవగాహన పెంచడానికి ఎంవోయూ మీద సంతకాలు జరిగాయి.

ఈ రుణాల ప్రయోజనాల గురించి ఖాదాదార్లకు సమాచారాన్ని అందించడంతో పాటు, భారతదేశంలో వ్యవసాయ తనఖా రుణాలను మెరుగుపరచడానికి మరిన్ని కార్యకలాపాలు చేపట్టడం ఈ ఎంవోయూ లక్ష్యం.

చిన్న & సన్నకారు రైతుల్లో ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌ల అంగీకారానికి సంబంధించి, కొత్త రుణాలు విస్తృత ప్రభావం చూపుతుందని ఊహిస్తున్నారు. విక్రయాల్లో కష్టాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు మెరుగైన ధరలను కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ వ్యవస్థలోని భద్రత, బేరసారాల సామర్థ్యంతో కలపడం ద్వారా, గ్రామీణ ద్రవ్యతను మెరుగుపరచడంలో, రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రొడ్యూస్ మార్కెటింగ్ రుణాలు విజయం సాధిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (ఎస్‌బీఐ) ఈ ఎంవోయూ కుదిరింది.

ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గిన వరి సాగు ... ఇప్పటికి సాగు అయ్యింది 9 లక్షల ఎకరాలు మాత్రమే

గ్రామీణ రుణాలను మెరుగుపరచడానికి గిడ్డంగి రశీదులను ఉపయోగించడం ద్వారా అందించే పంట తనఖా రుణాల ప్రాముఖ్యతపై ఈ కార్యక్రమంలో క్లుప్తంగా చర్చ జరిగింది. ఈ రంగంలో రుణ సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను కూడా బ్యాంక్ ప్రతినిధులు వివరించారు. వారిలో విశ్వాసాన్ని మెరుగుపరిచేందుకు, పూర్తి నియంత్రణ సంబంధిత మద్దతుకు డబ్ల్యూడీఆర్‌ఏ హామీ ఇచ్చింది.

ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గిన వరి సాగు ... ఇప్పటికి సాగు అయ్యింది 9 లక్షల ఎకరాలు మాత్రమే

Related Topics

farmerloan

Share your comments

Subscribe Magazine