ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) 'MRIDA' అనే మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది, ఇది చిన్న సన్న కారు రైతులు పొలంలో భూసారం పెంచుకోవడానికి అవసరమైన సలహాలను అందించడంలో సహాయపడుతుంది .
MRIDA (మేనేజింగ్ రిసోర్సెస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) యాప్‌ను జర్మన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (GIZ) నిధులు సమకూర్చి భూసారం పెపొందించడానికి అవసరమయ్యే సూచనలు చేయడానికి రూపొందించబడింది . హిందీలో 'మ్రిదా ' అంటే నేల.
ఈ యాప్ ఎరువులు, పంట ఎంపిక, వాతవరణ సూచనలు నీటిపారుదల అనే నాలుగు కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుంది. వ్యవసాయ సీజన్ కు అనుకూలమైన పంటలను సూచించడం లో భూమి సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి సహాయపడుతుందని క్రిసాట్‌లోని రెసిలెంట్ ఫార్మ్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎల్ జాట్ అన్నారు.
యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..
ఈ యాప్ ప్రస్తుతం మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు (జల్నా, ధూలే, అహ్మద్‌నగర్, అమరావతి మరియు యావత్మాల్) మరియు ఒడిశాలోని ఎనిమిది జిల్లాల్లో (అంగుల్, బోలంగీర్, దేవ్‌ఘర్, ధెంకెనాల్, కలహండి, కెందుఝర్, నువాపాడా మరియు సుందర్‌ఘర్) మోడలింగ్ అధ్యయనం ఆధారంగా రూపొందించబడింది. ఈ యాప్ వల్ల రైతులు వ్యవసాయ క్షేత్రంలో తీసుకుంటున్న చర్యలను శాస్త్రవేత్తలకు చేరవేయడంలో కూడా సహాయపడుతుంది .
Share your comments