Agripedia

నానో యూరియాతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు!

KJ Staff
KJ Staff
Nano urea liquid
Nano urea liquid

వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతతీయ రైతు ఎరువులు సహాకార సంస్థ (ఇఫ్కో) ఎరువుల విషయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రపపంచంలోనే మొదటిసారిగా నానో యూరియాను ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ లిక్విడైడ్జ్ నానో యూరియా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామనీ, త్వరలోనే రైతులకు అందుబాటులో తీసుకువస్తామని ఆ సంస్థ పేర్కొంది.  ఈ లిక్విడైడ్జ్ నానో యూరియాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం ఇప్పటికే అనుమతి లభించింది.

ప్రపపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే ఎరువులలో యూరియా ఒకటి. భారత్ లోనూ దీనిని అధికంగానే వాడుతున్నారు. తక్కువ ధరలోనే మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో దీనిని రైతులు సాగులో అధికంగా వినియోగిస్తున్నారు. ఒక్కోసారి యూరియా ఎరువుల కొరత ఏర్పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే సాంప్రదాయ యూరియా ప్రత్యామ్నాయంగా ఇఫ్కో సంస్థ  గుజరాత్ లోని కలోల్ లోని ఎరువుల తయరీ యూనిట్ లో నానో యూరియాను ఉత్పత్తి చేస్తోంది. అక్కడి నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (ఎన్ బీ ఆర్ సీ)లో యాజమాన్య టెక్నాలజీ ద్వారా దీనిని దేశీయంగా అభివృద్ధి చేశారు.

కొత్తగా అభివృద్ధి  చేసిన ఈ నానో యూరియా ప్రపపంచ వ్యాప్తంగా వినియోగించబడుతున్న సాంప్రదాయ యూరియా వాడకాన్ని భర్తీ చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నానో యూరియాలో  నత్రజని కంటెంట్ దాదాపు 46 శాతం వరకు ఉంటుంది. తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. సాగు ఉత్పాదకత పెంచడంలో ఎరువులు కీలకం. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడటం అంతే ముఖ్యం.  ఈ నానో యూరియాతో పర్యావరణ కాలుష్యం సైతం తగ్గుతుందని తయారీదారులు చెబుతున్నారు. మట్టి, గాలి, నీరును సురక్షితంగా భవిష్యత్ తరాలకు అందించే చర్యలలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉండే ఉంటుంది. ఇందులోని మెరుగైన పోషకాలు పంట నాణ్యతను పెంచుతాయి. సాంప్రదాయక యూరియాతో పోలిస్తే ధర తక్కువ.  సాధారణంగా రైతులు ఒక పంట కాలంలో ఎకరాకు రెండు బస్తాల వరకు యూరియా వినియోగిస్తారు. పంటను బట్టి ఇది మారుతుంది కూడా.  అయితే, కొత్తగా వచ్చిన నానో యూరియా 500 మిల్లీ లీటర్ల బాటిల్ నానో యూరియాలో 4 వేల పీపీఎంల నత్రజని ఉంటుంది. అంటే ఒక  సాంప్రదాయ యూరియా బస్తాను ఇది భర్తీ చేస్తుందనీ, అందుకు సమానమైన నత్రజని పోషకాలను అందిస్తుందని ఇఫ్కో అధికారులు పేర్కొంటున్నారు.

Share your comments

Subscribe Magazine