పైనాపిల్ అనేది కాక్టస్ జాతికి చెందిన మొక్క. ఈ పైనాపిల్ తినడం వలన మనకు అనేగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇటీవలి కాలంలో చాలా మంది యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం తణుకులాడకుండా కొత్తగా ఆలోచించి వ్యవసాయరంగం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులు ఈ పైనాపిల్ పంటను సాగు చేసి లక్షల్లో లాభాలు పొందవచ్చని అంటున్నారు. పైగా మార్కెట్లో కూడా ఈ పైనాపిల్ కు చాలా డిమాండ్ కూడా ఉంది.
నేటి యువత ఎక్కువ శాతం వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక పద్ధతులు, పంటలు పండించడానికి యంత్రాలు మరియు సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలను పండిస్తున్నారు మరియు వాటితో లక్షల్లో అధిక లాభాలు పొందుతున్నారు. నేడు చాల మంది యువత సాఫ్ట్‌వేర్ జాబ్ సైతం రిజైన్ చేసి, ఈ వృత్తిలోకి అడుగులు వేస్తున్నారు.
ఈ కాలం యువత సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలు పండించి అధిక లాభాలు పొందవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. ఈ తరహాలోనే పైనాపిల్ పంట సాగుచేసి, హెక్టారుకు 30 టన్నుల పైనాపిల్ పళ్లను ఉత్పత్తి చేయగలిగితే లక్షల్లో లాభం వస్తుంది.
ఈ పైనాపిల్ పంటకు ఎందుకు అంత డిమాండ్ అంటే, ఈ పైనాపిల్ మొక్క అనేది వేడి వాతావరణంలో కూడా చాలా బాగా పెరుగుతుంది. పైగా ఈ పంటను కేవలం ఒక సీసన్ లో మాత్రమే కాకుండా సంవత్సరం పొడవునా పండించి లాభాలు పొందవచ్చు. ఈ పైనాపిల్ తో మనకు అనేక ఆరోగ్య ప్రయుజనాలు ఉన్నాయి మరియు ఇది మన ఆకలి పెంచడంలో సహాయపడుతుంది. మనకు ఈ పైనాపిల్ ఉదర సంబంధిత సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..
నిమ్మగడ్డి సాగుతో అధిక లాభాలు..
చాలా ఫార్మా కంపెనీలు ఈ పైనాపిల్ ను అనేక రకాల మందుల్లో కూడా వినియోగిస్తారు. పైగా ఈ పంటను పండించడం వలన అధిక లాభాలు పొందవచ్చు. కాబట్టి ఈ పంటకు మార్కెట్లో అంత డిమాండ్ ఉంది.
సుమారుగా ఈ పంట పక్వానికి రావడానికి 18-20 నెలలు పడుతుంది. రైతులు ఎక్కువ సమయం పడుతున్న అధిక లాభాలు వస్తున్నందున ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే పైనాపిల్ కు ఎక్కువగా నీరు అవసరం ఉండదు మరియు వాతావరణ విషయల్లో కూడా దిగులు చెందకర్లే. ఈ పంటను ఈ పైనాపిల్ పంట నిర్వహణ కూడా చాలా సులువు. ఈ పంటను పండు రంగు ఎరుపు-పసుపులోకి వచ్చినప్పుడు కోత కోయాలి. ప్రస్తుతం మార్కెట్ లో పైనాపిల్ కిలో పండుకు ధర రూ.150 నుంచి 200 వరకు పలుకుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments