మన భారతీయ వంటకాల్లో బెండకాయకు విశేషమైన స్థానం ఉంది. బెండను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వంటకాల్లో వినియోగిస్తారు. బెండకాయ అన్ని కాలాల్లోనూ పండే పంట. దాదాపు అన్ని రకాల నేలలు బెండకాయ సాగుకు అనుకూలమే. బెండను సాగు చెయ్యడానికి తక్కువ మొత్తంలో నీరు సరిపోతుంది, కాబట్టి దీనిని ఆరుతడిపంటగా కూడా సాగు చెయ్యవచ్చు. ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ఎంతోమంది రైతులు బెండసాగును చేపట్టారు. ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించడం ద్వారా బెండలో అధిక దిగుబడులు సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండసాగు చేపట్టే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఏ పంట ఎదగడానికైనా పోషకాల యాజమాన్యం తప్పనిసరి, బెండసాగులో అందించే పోషకాలపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే బెండసాగు కోసం ఎంతోమంది రైతులు హైబ్రిడ్ రకాల మీదే ఆధారపడుతుంటారు. హైబ్రిడ్ రకాలకు అవసరమైన పోషకాలను సరైన మొత్తంలో అధించకుంటే పంట దిగుబడి తగ్గిపోతుంది.
బెండను ఏడాది పొడువున సాగు సాగు చెయ్యచ్చు, ఎంతోమంది రైతులు దీనిని వేసవి పంటగా సాగు చేస్తారు. సాగునీటి లభ్యత తక్కువ ఉన్న చోట్ల కూడా బెండను సులభంగా సాగు చెయ్యవచ్చు. బెండ ఆరుతడి పంట, అంతేకాదు కేవలం నాలుగు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. ప్రస్తుతం బెండలో ఎన్నో రకాల హైవ్రిడ్ విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సాగు చెయ్యడం ద్వారా ఒక ఎకరానికి 50 నుండి 100 క్వింటాల్ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మార్కెట్లో బెండకు సంవత్సరం మొత్తం స్థిరమైన రేటు లభిస్తుంది, కాబట్టి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
Share your comments