వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 జూలై నెలలో దేశంలో ఉల్లి ఉత్పత్తి(Onion production ) 16.81 శాతం పెరిగి 31.12 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాలను విడుదల చేసింది
2021-22 పంట సంవత్సరంలో (జూలై-జూన్) దేశంలో 26.64 మిలియన్ టన్నుల ఉల్లిని(Onion production ) పండించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలుపగా . మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, ఉల్లి సాగు (Onion production ) కోసం విత్తిన విస్తీర్ణం 2021-22 లో 1.62 మిలియన్ హెక్టార్ల నుండి 2022-23 సంవత్సరంలో 1.91 మిలియన్ హెక్టార్లు ఎక్కువగా సాగు అయినట్లు వెల్లడించింది.
ఇతర కీలక కూరగాయలతో పాటు, బంగాళాదుంప మరియు టమాటా ఉత్పత్తి 2022-23 లో తగ్గుతుందని అంచనా. 2021-22లో 56.17 మిలియన్ టన్నులుగా ఉన్న బంగాళాదుంపల దిగుబడి 2022-23 పంట సంవత్సరంలో 53.60 మిలియన్ టన్నులకు పడిపోతుందని, టమోటా ఉత్పత్తి 20.30 మిలియన్ టన్నుల నుంచి 20.30 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచనా వేసింది.
మొత్తం కూరగాయల ఉత్పత్తి 2022-23 పంట సంవత్సరంలో 199.88 మిలియన్ టన్నులుగా ఉంది, ఇది ఒక గత సంవత్సరం 200.44 మిలియన్ టన్నులుగా ఉందని తెలిపింది
పండ్ల ఉత్పత్తి పెరగడం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధ మొక్కలు, తోటల పంటలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని తెలిపింది.
2021-22లో 20.38 మిలియన్ టన్నుల మామిడి ఉత్పత్తితో పోలిస్తే 2022-23లో 20.33 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. కొబ్బరి, జీడిపప్పు వంటి తోటల పంటల విషయంలో, మొత్తం ఉత్పత్తి 2021-22 లో 16.62 మిలియన్ టన్నుల నుండి 2022-23 లో 15.85 మిలియన్ టన్నులకు తగ్గే అవకాశం ఉంది.
ఏడాది క్రితం ఇదే కాలంలో 11.11 మిలియన్ టన్నుల నుండి సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 10.11 మిలియన్ టన్నులకు పడిపోతుందని భావిస్తున్నారు.
2022-23లో దేశంలో మొత్తం ఉద్యాన ఉత్పత్తి 333.25 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది, ఇది 2021-22 పంట సంవత్సరంలో 334.60 మిలియన్ టన్నుల నుండి స్వల్పంగా 0.4 శాతం తగ్గింది.
Share your comments