సిక్కిం స్టేట్ కోఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్( SIMFED) నిర్వహిస్తున్న మొదటి ఆర్గానిక్ నార్త్-ఈస్ట్ ఎక్స్‌పో 2023 అస్సాం రాజధాని ఖానాపరా వెటర్నరీ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు మూడు రోజుల జరగనుంది. మూడు రోజుల పాటు సాగె ఈ ఎక్స్‌పో లో అస్సాం మరియు ఈశాన్య ప్రాంతాల్లోని సేంద్రీయ రైతులను లక్ష్యంగా చేసుకొని సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన తీసుకురావడానికి అస్సాం ప్రభుత్వం సిక్కిం స్టేట్ కోఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్( SIMFED) బాగా స్వామ్యంతో ఈ ఎక్సపో ని నిర్వహిస్తుంది .
ఈ ఎక్సపో భాగంగా అక్కడి ఆర్గానిక్ రైతులకు వ్యవసాయం ల వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన ఆర్గానిక్ స్టార్ట్ అప్ లపై అవగాహన పెంచడం ఏ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం . ఈ ఎక్స్‌పో 160కి పైగా ఆర్గానిక్ మరియు నేచురల్ బ్రాండ్‌లు స్టాల్స్‌ను కలిగి ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరికరాలు, కొత్త టెక్నాలజీలు మరియు స్టార్టప్ కంపెనీల ద్వారా వ్యాపారాన్ని ప్రోత్సహించడంపై శిక్షణలు మరియు సెమినార్‌లలో కూడా రైతులు పాల్గొనగలరు. ఈ ఈవెంట్ అంతర్జాతీయ మరియు దేశీయ కొనుగోలుదారులతో పాటు ఎగుమతిదారులు మరియు రైతుల సమూహాలు/FPO లకు ఒక వేదికను అందిస్తుంది.
సరైన పంట నిల్వ గోడౌన్లు లేకపోవడం ద్వారా మన రైతులు పంటలను ఇంట్లో భద్ర పరచడం లేదా తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది , అయితే ఉత్పత్తులను విదేశాలకు లేదా మరెక్కడైనా తీసుకువెళ్లి నష్టాలను తగ్గించుకుని లాభాలు పొందాలంటే ఎలా?
మన రైతులు చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తారు కానీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరికరాలు, కొత్త టెక్నాలజీలు మొదలైన వాటికి సంబంధించిన సౌకర్యాలు మరియు జ్ఞానం లేకపోవడం వల్ల ఈ ఉత్పత్తులు ప్రాచుర్యం పొందలేవు కావున 1వ ఎక్స్‌పో ఆర్గానిక్ నార్త్-ఈస్ట్ 2023 ఇప్పుడు అటువంటి ప్రతి సమస్య మరియు పరిమితికి ఏకైక పరిష్కారం. ఆర్గానిక్ ఎక్స్‌పోను SIMFED మరియు అస్సాం ప్రభుత్వ వ్యవసాయ శాఖ నిర్వహిస్తుంది. కావున రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న హాజరు కావాలని రైతులకు ప్రభుత్వం పిలుపు ఇచ్చింది .
మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...
(గమనిక- సేంద్రీయ వ్యవసాయంలో నిమగ్నమైన వారికి శుభవార్త. గౌహతిలో అతిపెద్ద సేంద్రీయ వ్యవసాయ వాణిజ్య ప్రదర్శన జరగనుంది. సిక్కిం స్టేట్ కోఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. లేదా సంక్షిప్తంగా సిమ్‌ఫెడ్ కోసం SIMFED వాణిజ్య ప్రదర్శనలో నాలెడ్జ్ భాగస్వామి పాత్రను పోషిస్తుంది. ఫిబ్రవరి 3 నుండి 5 వరకు నిర్వహించబడుతుంది. సేంద్రీయ పంటలు పండించే రైతులు లేదా ఉత్పత్తిదారులతో వినియోగదారుల సంబంధాలను ఏర్పరచుకునే లక్ష్యంతో ఈ ఫెయిర్ నిర్వహించబడనుంది మీరు ఈ ఫెయిర్‌లో చేరాలనుకుంటే, దయచేసి ఈ నంబర్‌ను సంప్రదించండి- 9891223340)
Share your comments