Agripedia

ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ మోడల్‌ను అనుసరించాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఎఫ్‌సీఐ సూచన!

Srikanth B
Srikanth B

2 పొరుగు రాష్ట్రాలు అనుసరించిన క్రింది పద్ధతుల ద్వారా, (TS) తెలంగాణ   బాయిల్డ్  రైస్ సేకరణ పరిష్కరించుకోవాలి FCI తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది .ముఖ్యంగా రబీ సీజన్‌లో నాసిరకం బియ్యం సమస్యను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మోడల్‌ను అనుసరించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీనియర్‌ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్ విరిగిన బియ్యానికి రూ.110 చెల్లిస్తుంది. చత్తీస్‌గఢ్‌లో క్వింటాల్‌కు రూ.120 చెల్లిస్తున్నారు. తెలంగాణ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తే నాసిరకం బియ్యం సమస్య, ధాన్యం కొనుగోలు సమస్య కు పరిష్కారం లభిస్తుందని తెలిపింది .

రైస్ మిల్లులు తమకు సరఫరా చేసే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్‌సిఐకి ఇవ్వాలి మరియు అందులో 17 కిలోల (25 శాతం) విరిగిన బియ్యాన్ని ఎఫ్‌సిఐ స్వీకరిస్తుందని  ఎఫ్‌సిఐ మూడు శాతం దెబ్బతిన్న మరియు మూడు శాతం రంగు మారిన వరిని కూడాస్వీకరిస్తుందని  FCI తెలిపింది .

ఎఫ్‌సిఐ పరిమితికి మించి విరిగిన బియ్యానికి ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లు రైస్‌మిల్లులకు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. ఇలా రెండు రాష్ట్రాలు ఎఫ్‌సీఐకి ముడి బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి నమూనాను అనుసరించాలని ఎఫ్‌సిఐ వర్గాలు సూచించాయి.

భారతదేశంలో 18 లక్షల వాట్సాప్ అకౌంట్ లు నిలిపివేత !

విరిగిన  బియ్యాన్ని మిల్లర్లు కిలో రూ.19కి విక్రయించవచ్చని సూచించారు. కిలో బియ్యానికి రూ.14 లేదా రూ.15 మాత్రమే వస్తుందని మిల్లర్లు చెబితే, మిగిలిన రూ.5 లేదా రూ.4 కేజీ ప్రభుత్వం భరించాలి.

FCI Telangana కేవలం ముడి బియ్యాన్నే సేకరిస్తున్నందున రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.3,000 కోట్ల భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే విరిగిన బియ్యం, పొట్టు, ఇతర ఉప ఉత్పత్తులను మిల్లర్లు విక్రయించే అవకాశం ఉండడంతో ఎఫ్‌సీఐ అధికారులు రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి మరియు దాని కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

Share your comments

Subscribe Magazine