Agripedia

మొక్కలలో పోషక లోపాల లక్షణాలు మరియు అధిక మోతాదు వల్ల సంభవించే నష్టాలు!

S Vinay
S Vinay

మొక్కల ఎదుగుదలకి ముఖ్యంగ 17 పోషకాలు కావాలి. అయితే మొక్కలకి ఈ పోషకాలు తక్కువగా అందితే అంతగా అభివృద్ధి చెందక దిగుబడి తగ్గిపోతుంది అదే విధంగా ఈ పోషకాలను మొక్కలకు ఎక్కువగా అందించిన నష్టమే వాటిల్లితుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

నత్రజని (nitrogen):

నత్రజని లోపం:
మొక్కలలో నత్రజని లోపిస్తే ఆకులు లేత ఆకుపచ్చ రంగు ఒకే మారిపోతాయి. మరియు మొక్కల క్రింది భాగం ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, ఆకులు చివరికి గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి.మొక్కల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది, మొక్కలు కుంగిపోయి ముందుగానే పరిపక్వం చెందుతాయి.

అధిక మోతాదు లక్షణాలు:
మొక్కలకి అధికంగా నత్రజని అందితే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి.మొక్కల కాండం మరియు ఆకులలో అధికంగా రసం ఉత్పత్తి అవ్వడం వలన పురుగుల తాకిడి ఎక్కువ అవుతుంది. శాకీయ భాగాలు బాగా అభివృద్ధి చెంది ధాన్యం లేక పండ్ల దిగుబడి పడిపోతుంది.

భాస్వరం (Phosphorus)

లోపం
మొక్కల పెరుగుదల నెమ్మదిగా కుంగిపోతుంది మరియు క్రింది భాగం ఆకులు ఊదా రంగు లోకి మారిపోతాయి.

అధిక మోతాదు లక్షణాలు
అధిక భాస్వరం మొక్కపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు కానీ దీని మోతాదు ఎక్కువైతే జింక్ , ఇనుము మరియు మాంగనీస్ వంటి మూలకాల లోపాలను చూపిస్తుంది.సాధారణ కాల్షియం లోపం లక్షణాలు సంభవిస్తాయి.

పొటాషియం (Potassium)
లోపం

దిగువ భాగం ఆకులపై, అంచులు కాలిపోయినట్లు కనిపిస్తాయి, దీనిని స్కార్చ్ అని పిలుస్తారు. మొక్కలు తేలికగా ఉంటాయి మరియు వ్యాధి ముట్టడికి సున్నితంగా ఉంటాయి. పండ్లు మరియు విత్తనాల ఉత్పత్తి దెబ్బతింటుంది మరియు నాణ్యత తక్కువగా ఉంటుంది.

అధిక మోతాదు లక్షణాలు
పొటాషియం మోతాదు అధికం అయితే మొక్కలు సాధారణంగా మెగ్నీషియం మరియు కాల్షియం లోపం లక్షణాలను ప్రదర్శిస్తాయి.

కాల్షియం (Ca)

లోపం

పెరుగుతున్న వేర్లు మరియు ఆకుల గోధుమ రంగులోకి మారి చనిపోతాయి. అప్పుడే ఆవిర్భవిస్తున్న ఆకుల అంచులు ఒకదానికొకటి అతుక్కోవడం వల్ల ఆకుల అంచులు చిరిగిపోయినట్లు కనిపిస్తాయి. పండ్లపై మొగ్గ చివరి తెగులు సంభవించడంతో పండ్ల నాణ్యత దెబ్బతింటుంది.

అధిక మోతాదు లక్షణాలు:
మొక్కలు సాధారణ మెగ్నీషియం లోపం లక్షణాలను ప్రదర్శించవచ్చు మరియు అధిక మోతాదులో ఉన్నప్పుడు, పొటాషియం లోపం కూడా ఏర్పడవచ్చు.

మెగ్నీషియం (Magnesium)
లోపం

దిగువ భాగం ఆకులు పసుపు రంగులో మారిపోతాయి, మొక్కల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది మరియు కొన్ని మొక్కలు సులభంగా వ్యాధి బారిన పడవచ్చు.

అధిక మోతాదు లక్షణాలు:
మెగ్నీషియం అధికం అయితే పొటాషియం మరియు కాల్షియం లోపం లక్షణాలు కనిపిస్తాయి.

సల్ఫర్ (Sulfur)

లోపం

మొత్తం మొక్క యొక్క సాధారణ మొత్తం లేత ఆకుపచ్చ రంగు లోకి మారిపోతాయి, దిగువ భాగం ఆకులు లేత ఆకుపచ్చ నుండి పసుపు రంగులోకి మారిపోతాయి.

అధిక మోతాదు లక్షణాలు
సల్ఫర్ అధికం అయితే ఆకులలో అకాల వృద్ధాప్యం సంభవించవచ్చు.

మరిన్ని చదవండి.

ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రం మరియు పౌల్ట్రీలో రైతన్నలు చేపట్టాల్సిన పనులు!

Share your comments

Subscribe Magazine