వరి సాగు చేసే రైతులు ఎదుర్కొనే సమస్యలలో అతి ముఖ్యమైనది కలుపు నివారణ , పొలంలో కలుపు కారణంగా రైతులు తగిన దిగుబడి పొందలేక తీవ్రంగా నష్ట పోతుంటారు , దిగుబడి పై తీవ్రం గ ప్రభావితం చూపే కలుపును నివారించడానికి సకాలంలో లో చర్యలు తీసుకోవడం ద్వారా రైతులు నష్టాన్ని నివారించు కోవచ్చు , అయితే వరిలో సాగులో ప్రధాన సమస్యగా మారె కలుపు మొక్క తుంగ ను ఎలా నివారించాలి ఎక్కడ చూద్దాం.
ఎల్లోసెడ్డ్ ( స్తెప్రస్ ఇరియా)పసుసుతుంగ
ఈ తు౦గ మొక్క 20-60 సెం. మీ ఎరత్తు ఉ౦టు౦ది. దీని కా౦డము త్రికోణాకారములో ఉ౦టు౦ది. ఆకు తొడుగు అడుగు భాగ౦లో కా౦డ౦ కప్పి ఉ౦టు౦ది.ఇది పేపర్ లాగ ఉ౦టు౦ది.ఆకులు సన్నగా సూదిలాగ ఉ౦టాయి.
కలుపు యాజమాన్యం:
నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి బె౦థియోకార్బ్ 50% 1.5 ను౦డి 2.0 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 లేక ౩ రోజుల్లో లేదా 7 లేక 8వ రోజున గాని పిచికారి చేయాలి లేదా బె౦థియోకార్బ్ 50% 20 కిలోల ఇసుకతో కలిపి పలచటి నీటిపొర ఉన్నప్పుడు సమానంగా వెదజల్లి నీరు ఇ౦కేటట్లు చూడాలి లేదా విత్తిన 14, 15 రోజులప్పుడు సైకలోపాప్ బ్యు టైల్ 10%400 మి.లి. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Sukanya Samriddhi yojana : సుకన్య సమృద్ధియోజన .. రూ . 250 తో 1. 5 లక్షల ఆదాయం ...
మాగాణి వరిలో ఊద మొదలైన ఏక వార్షక గడ్డిజాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యుటాక్లోర్ 50% 1 ను౦డి 1.5 లీ. లేదా అనిలోఫాస్ ౩౦% 500 మి.లీ. లేదా ప్రిటిలాక్లోర్ 50% 500 మి.లీ. లేదా బె౦థియోకార్చ్ 5o% 1.5 ను౦డి 2.0 మి.లీ లలో ఏదో ఒకదానిని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన ౩ ను౦డి 5 రోజులలో పలుచగా నీరు పెట్టీ ససూన౦గా వెదజల్లాలి. గడ్డి ,తుంగ, వెడల్పటి ఆకు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యుటాక్లోర్ 5 శాత౦ గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిస 3 ను౦డి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమాన౦గా వెదజల్లాలి లేదా ఎకరాకు 35 ను౦డి 50 గ్రా ఆక్సాడయార్టిల్ 80 శాత౦ పొడి మ౦దును 500 మి.లీ. నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 ను౦డి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమాస౦గా వెదజలాలి. నాటిన 25-30 రోజులప్పుడు పొల౦లో వెడలాఎటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రా. 2, 4 -డి సోడియ౦ సాల్ట్ 80 శాత౦ పొడి ను వెదజల్లాలి .
Share your comments