భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014
సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం డీడీ నేషనల్ , డీడీ న్యూస్ చానల్స్ లో విజయవంతంగా ప్రసారం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 79 వ ఎపిసోడ్ 25 జూలై 2021 న ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
భారతదేశంలో వ్యవసాయం రంగంలో వస్తున్న మార్పుల పై మాట్లాడుతూ తక్కువ పెట్టుబడి,
ఎక్కువ లాభాలు కలిగిన రేగు పండ్ల(బేర్ పండ్ల)
సాగును వీలైతే రైతులు చేపట్టాలని సూచించారు.
దేశ ప్రధాని సూచించిన రేగు పండ్ల సాగు పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న సందర్భంగా
రేగుపండ్ల సాగు వివరాలు,వాటి ఆరోగ్య ప్రయోజనాలు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రేగు పండ్లును ప్రాంతాన్ని బట్టి బేర్ పండ్ల, జుజుబీ వంటి పేర్లతో పిలుస్తారు. రేగు పండ్ల సాగుకు అన్ని రకాల నేలలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలమే.అయితే పొడి వాతావరణంలో ఈ చెట్లు బాగా పెరిగి బెట్ట పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకుంటాయి.
మొక్కలు నాటిన 3 నుంచి 4 ఏళ్లలకు ప్రతీ చెట్టూ సగటున 100 నుంచి 250 కేజీల పండ్ల దిగుబడిని ప్రతి సంవత్సరం ఇస్తుంది. మనం తీసుకునే యాజమాన్య పద్ధతులు బట్టి 30 ఏళ్ల వరకూ అధిక దిగుబడిని పొందవచ్చు. రేగు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది వీటిని ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి సమృద్ధిగా ఉండి అనేక రకాల ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రేగు పండ్ల సాగును ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు , మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల రైతులు చేపట్టి అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.
Share your comments