Agripedia

కౌజుపిట్టలా పెంపకం... కూసింత ఖర్చుతో లాభాల పంట...

KJ Staff
KJ Staff

మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల్లో కూడా కొత్త మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మాంసాహారులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కోడి మాంశంతో పాటు కౌజు పిట్టల మాంసానికి కూడా గిరాకీ పెరిగింది. కోడి మాంశంతో పోలిస్తే కౌజుపిట్టలా మాంశంలో ప్రోటీన్లు ఎక్కువుగా ఉండటంతో, ఈ మాంసానికి డిమాండ్ ఎక్కువవుతుంది. దీనిని బట్టి కౌజు పిట్టల పెంపకం లాభాసాటిగా మారుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని యువత మరియు మహిళలు ఎవరైనాసరే కౌజు పిట్టల పెంపకం చేపట్టవచ్చు. కోళ్ల పెంపకంతో పోలిస్తే కౌజు పిట్టల పెంపకానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. వీటిని కొద్దిపాటి స్థలంలోనైనా సరే సులభంగా పెంచుకోవచ్చు. మార్కెట్లో వీటి మాంశంతో పాటు గ్రుడ్లకు కూడా డిమాండ్ ఎక్కువుగా ఉంటుంది, కాబట్టి అన్ని కోణాల్లోనూ వీటి పెంపకం లాభదాయకం. వీటి పెంపకానికి అయ్యే ఖర్చుతోపాటు, పెట్టుబడి కూడా చాలా తక్కువ. 10 చదరపు అడుగుల్లో సుమారు 100 కౌజుపిట్టల పెంచుకోవచ్చు.

కోళ్లను పెంచేవారికి ప్రధానంగా ఎదురయ్యే సమస్య వాటిని రోగాల భారిన పడకుండా కాపాడటం, ఒక్కసారి రోజలు సోకితే, రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కోళ్లకు వ్యాధులు రాకుండా వేయించే టీకాల మీద రైతులు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అదే కౌజు పిట్టలు పెంచేవారికి ఇటువంటి సమస్య ఎదురయ్యే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే కౌజు పిట్టలకు రోగనిరోధక శక్తీ చాలా ఎక్కువ కాబట్టి వ్యాక్సిన్ల అవసరం ఉండదు

కౌజు పిట్టలు పెంచేవారు కూడా కోళ్లకు అందించినట్లు, దాణా మరియు శుభ్రమైన నీరు అందిస్తే సరిపోతుంది. వీటిని పెంచడానికి ఎక్కువ కలం కూడా పట్టదు కేవలం 4-5 వారాలల్లోనే 250-300 గ్రాముల బరువు పెరుగుతాయి, వీటిని ఐదు వారలు పెంచడానికి 25-30 రూపాయిలు ఖర్చయినా, హోల్సేల్ మార్కెట్లో వీటి ధర 50-60 రూపాయిల మధ్య ఉంటుంది. అయితే కౌజు పిట్టల పెంపకం మొదలుపెట్టె ముందు వీటికి మార్కెట్ ఉందా లేదా అన్న విషయాన్నీ చూడాలి. వీటిని ఎక్కువగా హోటళ్ల వారు ఖరీదు చేస్తారు కాబట్టి వారికి విక్రయించవచ్చు. కౌజు పిట్టల మాంశంతోపాటు వీటి గ్రుడ్లను మార్కెట్ చేసుకోవడానికి వీలుంటుంది.

సాధారణంగా కౌజు పిట్టలను పెంచేవారు, వారానికి ఒక బ్యాచ్ వచ్చేలా, షెడ్ ని భాగాలుగా విభజించుకుంటారు. ఒక్కో బ్యాచ్ లో 500 పక్షులు పెంచుకుంటే, నెలకు 2000 పక్షులకు సుమారు 48,000- 50,000 వరకు ఆదాయం పొందవచ్చు. మొత్తానికి గ్రుడ్లను వికరించగా వచ్చిన ఆదాయం తోడై మరింత ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కౌజు పిట్టల పెంపకం మొదలు పెట్టేవారు, బ్రీడర్స్ కోసం హైద్రాబాద్లోని రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల నుండి పొందవచ్చు, కాకపోతే రెండు నెలల ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బ్యాచ్ ని పెంచగానే, వాటి నుండి వచ్చిన గ్రుడ్లను పొడిగించి బ్రీడర్స్ తయారుచేసుకోవడం వలన తిరిగి మళ్ళి కొనుగోలు చెయ్యవలసిన అవసరం ఉండదు.

Share your comments

Subscribe Magazine