Agripedia

చౌడుభూముల్లో సైతం పెరిగే చెరుకురకాలు....

KJ Staff
KJ Staff

మన భారత దేశంలో అధిక విస్తీరణంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో చెరుకు పంట ఒకటి. ప్రతి ఏటా దాదాపు 30 మిలియన్ టన్నుల చెరుగు ఉత్పత్తవుతుంది. అన్ని రకాల వాతావరణాలు మరియు మట్టికి తగ్గట్టు చెరుకు రకాలు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఉప్పునీరు మరియు రసాయన ఎరువుల వినియోగం ద్వారా నేలలు చౌడుబారుతున్నాయి. ఇలా చౌడుబారిన నేలల్లో పంటలు పండించడం చాలా కష్టం. అయితే ఇటువంటి నేలల్లో కూడా అధిక దిగుబడినిచ్చే చెరుకు రకాలు అందుబాటులోకి వచ్చాయి.

భూమిలో సహజంగా లవణాలు ఉంటాయి. వీటి శాతాన్ని బట్టి మట్టిలోని ఉదజని సూచికను నిర్ణయిస్తారు. ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గిపోతుంది, దీనివలన మొక్కకు అందవలసిన పోషకాలు మొక్కలకు అందవు. పైగా నీటిని తీసుకోవడంలో కూడా ఆటంకం ఏర్పడి పైరు ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని రకాల మొక్కలు చౌడు నేలల్లో కూడా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. ప్రస్తుతం చౌడు నేలలకు అనువుగా ఉండే చెరుకు రకాలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు వీటిని సాగు చెయ్యడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు. చౌడు భూముల్లో కూడా ఎదిగేందుకు అనువుగా ఉన్న చెరుకు రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చౌడు నేలలను సైతం తట్టుకొని నిలబడి మంచిదిగుబడినిచే చెరుకు రకాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఆచార్య ఏజి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు తిరుపతి వ్యవసాయ విద్యాలయం పరిధిలోని పరిశోధన కేంద్రాలు చౌడునేలలను తట్టుకోగలిగే చెరుకు రకాలను విడుదల చేసారు. వాటిలో 81వి48, కోటి 8201, కో7219, 81ఎ99, 93ఎ145, 99ఎ30, 83వి15, 97ఎ85 రైతులకు అందుబాటులో ఉన్నాయి. చౌడు నెలల్లో సాగుచేసే రైతులు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిగా మట్టిలో లవణాల శాతం ఎక్కువుగా ఉండటం వలన మొక్కలు భూమిలోని పోషకాలు గ్రహించలేవు. ఇటువంటి భూముల్లో పంట సాగు చేసే ముందు, మట్టిలో చౌడు శాతం ఎంతుందో భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. చౌడు సమస్య ఉన్న భూములను నయం చెయ్యడానికి జిప్సం ఉపయోగించవచ్చు.

జిప్సం ఉపయోగించేందుకు పొలాన్ని బాగా దున్ని నీరి పెట్టి మడులుగా విభజించుకోవాలి. తరువాత ఎకరానికి 1 తన్ను జిప్సం వేసి రెండు రోజుల తరువాత ఆ నీటిని బయటకు పంపాలి. దీని వలన చౌడుశాతం చాలా వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పచ్చిరొట్ట పంటలను సాగుచేసి వాటిని భూమిలో కలియదున్నుకోవడం ద్వారా చౌడు సమస్య తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే చౌడు నేలల్లో పోషకాలు ఎక్కువుగా వినియోగించవల్సి ఉంటుంది కాబట్టి సూచించిన మోతాదుకన్నా ఎక్కువ శాతం ఎరువుల వినియోగం ఉంటుంది. ఈ విధంగా చౌడు నేలల్లో అన్ని యాజమాన్య పద్దతులను క్రమం తప్పకుండా పాటిస్తే మెరుగైన ప్రయోజనాలు మరియు అధిక దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.

Related Topics

#Soil #sugarcane #Alkalisoils

Share your comments

Subscribe Magazine