రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటికే కంది కోతలు ప్రారంభం అయ్యాయి , రాష్ట్రంలో మంగళవారం నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభించడానికి మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 100 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి డిమాండ్ను బట్టి పెంచాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్.. రాష్ట్రంలో మార్కెఫెడ్ ద్వారా మొత్తం దిగుబడిలో 39.55 శాతం సేకరించడానికి గ్రీ న్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లెక్కన ఈ సారి 70,020 టన్నుల కందులు ఎంఎస్పీతో నాఫెడ్ కొనుగోలు చేయనున్నది.
రాష్ట్రము లో పప్పుధాన్యాలలో అధికముగా సాగు అయ్యే ధాన్యం కంది పప్పు అత్యధికముగా సంగారెడ్డి జిల్లాలో వానాకాలం లో జిల్లాలో 90,658 ఎకరాలలో కంది పంట సాగైందని తెలంగాణాన వ్యవసాయ శాఖ ప్రకటన విడుదల చేసింది అయితే పంట సజావుగా కోతలు జరిగితే వచ్చే జిల్లా వ్యాప్తముగా 54,394 మెట్రిక్ టన్నులు దిగుబడి వరకు వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయ అధికారాలు అంచనాలు వేస్తున్నారు . వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ లో ఈ సారిరైతులు 1.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 83 వేలు, నా రాయణపేటలో 77 వేలు, ఆదిలాబాద్ జిల్లాలో 57 వేల ఎకరాల్లో కంది సాగు జరిగింది . ములుగులో 30 వేల ఎకరాలలో కంది సాగు జరిగింది .
యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...
పంట అమ్మకం దశలో రైతులు ఇబ్బంది పడకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 కు పైగా కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది , అవసరమైతే కొనుగోళ్లు సెంటర్లను పొడగించనున్నట్లు అధికారులు వెల్లడించారు .
గత సంవత్సరం కందుల MSP కనీస మద్దతు ధర 6300 ఉండగా ఏ సంవత్సరానికి 300 కనీస మద్దతు ధర పెంచింది . దీనితో పెరిగిన ధర తో రూ . 6600 కందులకు కనీస మద్దతు ధర రైతులకు లభించనుంది .
Share your comments