వరి సాగులో చేపల పెంపకం ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం పొందవచ్చు .వరి సాగు చేసే రైతులకు ఇది ఒక గొప్ప అవకాశం.మరిన్ని వివరాలు చదవండి.
చైనా, బంగ్లాదేశ్, మలేషియా, కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లలో ఈ రకమైన వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు, భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, చేపల వరి సాగు సహాయంతో, రైతులు రెట్టింపు ఆదాయం సంపాదిస్తున్నారు.భారతదేశంలో వరి సాగుకు అందుబాటులో ఉన్న మొత్తం భూమి 43.5 మిలియన్ హెక్టార్లు అందులో 20 మిలియన్ హెక్టార్లు ప్రధానంగా వర్షాధారంగా పండించే భూములు, అయితే, ప్రస్తుతం సుమారుగా 0.30 మిలియన్ హెక్టార్లలో వరి-చేపల పెంపకం సాగుతుంది.
ఈ తరహా సాగులో వరి పొలాల్లో నిల్వ ఉన్న నీటిలోనే చేపలు పెంపకం జరుగుతుంది. చేపల జాతులు,వ్యవసాయ పద్ధతి,మరియు దాని నిర్వహణపై చేపల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఈ తరహా సాగుకి లోతట్టు ప్రాంతాన్ని ఎంచుకోవాలి ఇక్కడ నీరు సులభంగా ప్రవహిస్తుంది.
వరి-చేపల సాగు వల్ల కలిగే లాభాలు:
ఒకే పొలంలో వరి పండించడం మరియు చేపల పెంపకం చేయడం వల్ల వరి మొక్కలకు వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు.
వరి-చేపల సాగు విధానం వలన వరి దిగుబడి 10-26 శాతం పెరుగుతుంది, లేబర్ ఇన్‌పుట్ ఖర్చులు 19-22 శాతం వరకు తగ్గుతాయి.
వాతావరణంలో ఉండే హానికర వాయువు మీథేన్, 10-20 శాతం వరి పొలాల నుండి వస్తుంది. వరి-చేపల సాగు విధానం మీథేన్ ఉద్గారాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది.
వరి-చేపల సాగు పద్ధతి నేల సారాన్ని పునరుద్ధరించడానికి మరియు నేల క్షీణతను నివారించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
వరి-చేపల పెంపకం అనేది ఒక వినూత్న వ్యవసాయ విధానం, దీనిలో వరి ప్రాథమిక పంటగా మరియు చేపలు ద్వితీయ ఆదాయ వనరుగా లాభాలను ఇస్తాయి.
మరిన్ని చదవండి.
Share your comments