Agripedia

లిప్స్టిక్ తయారీకి వాడే గింజల గురించి మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

మగువుల అందాన్ని పెంచే సాధనాల్లో లిప్స్టిక్ ఒకటి. ఇవి మార్కెట్లో వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. అయితే లిప్స్టిక్ పూసిన పెదాల నుండి జాలువారే నవ్వుల గురించి తెలిసిన మనకి వాటిని ఎలా తయారుచేస్తారన్న విష్యం తెలిసి ఉండదు.

సాధారణంగా లిప్స్టిక్ చేపల రక్తంతో చేస్తారన్న అపోహ అందరిలోనూ ఉంటుంది. అయితే ఇది నిజం కాదు. లిప్స్టిక్ తయారీకి, అనాటో అనే మొక్క గింజల నుండి తయారుచేస్తారు. ప్రకృతి సహజసిద్ధంగానే ఎన్నో రంగుల పూలను మనకు అందుబాటులో ఉంచింది. కొన్ని మొక్కల్లో పులతోపాటు వాటి గింజలకు కూడా ప్రత్యేకమైన రంగులు ఉంటాయి. దీనికి చెందినదే ఈ అనాటో మొక్క, దీనిని సింధూరి లేదా జాఫ్రా అనే అని కూడా పిలుస్తుంటారు. ఈ మొక్కల గింజల నుండి సేకరించిన రంగుతో లిప్స్టిక్ తయారీ చేపడతారు. ఈ గింజలకు పెంచి సరిగ్గా మార్కెటింగ్ చెయ్యగలిగితే, అధిక లాభాలు తెచ్చిపెట్టే పంట ఇది.

అయితే ఈ జాఫ్రా మొక్కలు అడవుల్లో ఎక్కువుగా పెరుగుతాయి. వీటి గింజల నుండి వచ్చే రంగు సహజసిద్దమైనది కాబట్టి వీటికి మార్కెట్లో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వీటిని నుండి రంగును లిప్స్టిక్ తయారీలో మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లో కూడా వినియోగిస్తారు. ఈ మొక్కలను గిరిజనులు వారి ఇంటి అవసరాల కోసం పెంచుకుంటురు. అయితే వారికి మార్కెటింగ్ మీద అవగాహన లేక వీటిని కిలో 100 రూపాయల చొప్పున మార్కెట్లో విక్రయిస్తారు, అయితే అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలో రూ. 1000 కి పైమాటే.

ఉద్యోగ అవకాశంలా కోసం ఎదురుచూస్తున్న యువతకు మరియు సేద్యాన్ని ఒక పరిశ్రమగా మార్చాలనుకున్న వారికి ఈ అనాటో గింజల సాగు ఎంతో లాభదాయకమని చెప్పవచ్చు. మార్కెటింగ్ మీద అవగహన మరియు ఎక్కడ విక్రయించాలన్న దాని మీద పూర్తి స్పష్టత ఉంటే వీటిని సాగు చెయ్యడం ఎంతో లాభదాయకం, అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మన దేశంలో వీటి సాగు అంత విస్తృతంగా లేనందున, పంట సంరక్షణకు పాటించవలసిన యాజమాన్య పద్దతుల గురించి, స్వయంగా పరిశోధించాల్సి ఉంటుంది, అయితే మార్కెట్లో వీటి లభ్యత తక్కువుగా ఉన్నందున, అన్ని సమయాల్లో మంచి ధర లభించడానికి ఆస్కారం ఉంటుంది.

ఈ పంటను ప్రారంభించడానికి మొదట సరైన మొత్తంలో భూభాగం ఉండాలి. దీనితోపాటు నీటి లబ్యత ఉండి, పొడి వాతావరణం కలిగిన భూభాగం వీటి సాగు అనుకూలం. కాకపోతే పంట ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాలు దిగుబడి ఉండదు కాబట్టి ఆర్ధికంగా ఇబ్బంది పడవలసిన ఉండచ్చు. ఈ సమస్యను నివారించేందుకు మొదటి రెండు సంవత్సరాలు, అంతరసేద్యంలో కూరగాయలు లేదా పప్పు దినుసులు పండించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. జాఫ్రా మొక్కలను ఒక్కసారి నాటితే దాదాపు 25 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం.

 

Share your comments

Subscribe Magazine