పామ్ ఆయిల్ మన దేశం లో అత్యంత ఎక్కువ గ ఉపయోగించే వంటనూనె.మన దేశం లో ప్రతి ఏడాది 2.2 కోట్ల టన్నుల వంట నూనె వినియోగిస్తాము. కానీ పామ్ ఆయిల్ గింజల ఉత్పత్తి 70 లక్షల టన్నులను మిచడం లేదు. ఈ కారణం చేత దేశం ప్రతి ఏటా ఒకటిన్నర కోట్ల టన్నుల వంట నూనె ను విదేశాల నుండి దిగుమతి చేసుకోడం జరుగుతుంది.
దీనిని అధిగమించి ,పామ్ ఆయిల్ దిగుమతి ని తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పామ్ ఆయిల్ సాగు ను పెంచేందుకు కొత్త చర్యలు నాంది పలికింది.వరిని తగ్గించి రైతులు పామ్ ఆయిల్ సాగు చేయడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తుంది.
వరితో పోలిస్తే ఆయిల్ పామ్‌కు 25% నీరు మాత్రమే అవసరం అవుతుంది . ఒక పూర్తిగా ఎదిగిన ఆయిల్ పామ్ తోట నుండి వచ్చే లాభాలు వరి కి 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ పామ్ సాగులో రైతులకు ఖర్చులు పోను ఎకరానికి లక్ష వరకు ఆదాయం లభిస్తుంది.
ఆయిల్ పామ్ సాగుకోసం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు:
రానున్న 3 సంవత్సరాలలో ,తెలంగాణలోని 25 జిల్లాల్లోని 20 లక్షల సాగు ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కింద మార్చడమే లక్ష్యం గా రాష్ట్ర సర్కార్ పని చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం పామ్ ఆయిల్ సాగు మొదలుపెట్టిన రైతులకు తమ పెట్టుబడి లో 50 శాతం సబ్సిడీ గ అందిస్తున్నది.
మొదటి సంవత్సరం లో : ఎకరాకు రూ.26,000
రెండవ సంవత్సరం లో : ఎకరానికి రూ. 5,000
మూడవ సంవత్సరం లో : ఎకరానికి రూ. 5,000 చొప్పున ఎకరాకు మొత్తం 36,000 రూపాయలను అందిస్తుంది
ఈ పథకం లో రైతుబంధు మాదిరిగానే డీబీటీ విధానంలో అంటే సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడుతుంది
2023-2024 ఆర్ధిక సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 1,970 కోట్లు రూపాయలను పామ్ ఆయిల్ సబ్సిడి కోసం కేటాయించనుంది.
పామ్ ఆయిల్ సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోడానికి మీ మొబైల్ లో క్రోమ్ ఓపెన్ చేసి MIP రెజిస్ట్రేషన్ ఫారం అని సెర్చ్ చేసి మొదటి లింక్ ను ఓపెన్ చేయండి.
రిజిస్ట్రేషన్ టైప్ అని ఉన్న దగ్గర farmer registration for oil palm through DBT to farmer అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ పట్టా పాస్ బుక్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ మార్క్ చేసాక సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వోచిన తర్వాత మిగతా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ అప్పుడు మీ Aadhar , Land Documents, Caste certificate. మొదలగు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ విధంగా తెలంగాణ లో పామ్ ఆయిల్ పండిస్తున్న రైతులు ఈ స్కీం కి దరఖాస్తు చేసుకొని పెట్టు బడి ఖర్చులపై దాదాపు 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం నుండి పొందవచ్చు.
ఇది కూడా చదవండి
Share your comments