News

పత్తి విత్తనాలకు రికార్డు ధరలు .. మోసపోతున్న రైతులు !

Srikanth B
Srikanth B
పత్తి విత్తనాలకు రికార్డు ధరలు .. మోసపోతున్న రైతులు !
పత్తి విత్తనాలకు రికార్డు ధరలు .. మోసపోతున్న రైతులు !

విత్తనాల దగ్గరనుంచి పంట అమ్మడం వరకు రైతులు దళారులు ,వ్యాపారులు చేతిలో మోసపోతూనే ఉంటారు ,తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో మోసపోతుంటే , మరోవైపు పత్తి విత్తనాలకు అధిక ధరకు విక్రయించి రైతులను నిట్ట నిలువునా ముంచుతున్నారు .

వాస్తవానికి రాష్ట్రంలో పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.853. కానీ వ్యాపారస్థులు మాత్రం రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఒక్కో ప్యాకెట్‌ను రూ.1500 ధరకు అమ్ముతున్నారు , కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని వర్షాలు కురిస్తే విత్తనాలు లభించవనే భావన రైతులలో సృష్టించి విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తున్నారు . రైతులంతా బీటీ2 రకం విత్తనాలపై మొగ్గు చూపుతున్నారు. అధిక ధరకు బయట కొనుగోలు..అధిక ధరకు విత్తన ప్యాకెట్లను తెచ్చుకుంటున్నా రైతులు మాత్రం ఈ విషయం బయటకు చెప్పటంలేదు. దీనివల్ల తమకు ఏమైన సమస్య వస్తుందనే ఉద్దేశ్యంతో చెప్పటానికి ముందుకు రావటంలేదు. కొందరు రైతులు డీలర్ల వద్ద ఉద్దెర తెచ్చుకుంటున్నారు.

ఆలస్యమైన రుతుపవనాలు.. రాష్ట్రంలోకి నెల 19 నాటికి వచ్చే అవకాశం..


రైతులు డీలర్లు అధిక ధరకు విత్తనాలను విక్రయిస్తున్న బయటకు చెప్పడం లేదు .. భవిష్యత్తులు డీలర్లు విత్తనాలు తమకు అమ్మరాని ,ఎరువులు , పురుగుల మందులు ఉద్ధారకు ఇవ్వరని రైతులు అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేస్తున్న బయటకు చెప్పడం లేదు ,రైతులు బయటకు చెప్పుకున్న వ్యవసాయాధికారులు అధిక ధరకు విత్తనాలను అమ్మే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు .

ఆలస్యమైన రుతుపవనాలు.. రాష్ట్రంలోకి నెల 19 నాటికి వచ్చే అవకాశం..

Related Topics

BT COTTON

Share your comments

Subscribe Magazine