News

ఉల్లి ఎగుమతుల మీద నిషేధం ఎత్తేసిన కేంద్రం.....

KJ Staff
KJ Staff

దాదాపు అన్ని భారతీయ వంటకాల్లోనూ ఉపయోగించే కూరగాయ ఏదైనా ఉంది అంటే అది ఉలిపాయ అని చెప్పవచ్చు. ఉల్లిపాయ పండించడంలో భారత దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ పండించిన ఉల్లిపాయలను అనేక దేశాలకు ఎగుమతి చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఉల్లి దిగుబడి ఘననీయంగా తగ్గిపోవడంతో కేంద్రం ఉల్లిపాయల ఎగుమతి పై 2023 డిసెంబర్ లో నిషేధం విధించింది. ఈ నిషేధం వల్ల ఉల్లి పంటను అధికంగా పండించే మహారాష్ట్ర రైతులును తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నిషేధాన్ని ఎత్తేయాలని ఎంతో మంది రైతులు నిరసన వ్యక్తం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ విష్యం మీద ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. అయితే దేశ ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే దేశంలో ఎన్నికలు జరుగుతుండగా కేంద్ర తెల్ల ఉల్లిపాయలు మీద నిషేధం ఎత్తేసి 2,000 మెట్రిక్ టన్నుల తెల్ల ఉల్లిపాయలను దుబాయ్, భూటాన్, బహరైన్, బాంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు ఎగుమతులను అనుమతించింది. ఈ ఎగుమతులును కేవలం గుజరాత్ లోని మూడు పోర్టుల నుండే నేషనల్ కోఓపెరటివే ఎక్సపోర్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్విహిస్తుంది. ఎన్నికల ముందు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆలోచింపచేస్తుంది.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర రైతులు ఈ నిర్ణయం మీద అసంతృప్తితో ఉన్నారు, ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువ మంది రైతులు ఎర్ర రకం ఉల్లిపాయలను పండిస్తారు. తెల్లరంగు ఉల్లిపాయలు గుజరాత్ లో మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు. ఈ నిర్యాణం ద్వారా తమకు అనాయ్యం జరుగుతుందని ఎర్ర రకం ఉల్లిపాయలు పండిస్తున్న రైతులు వాపోతున్నారు. ఉల్లి సాగు చేస్తున్న రైతులు కనీసం ఒకటిన్నర మిలియన్ టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి చేసేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వాని కోరుతున్నారు. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine