News

పెరుగుతున్న పప్పుదినుసుల ధరలు...... రెట్టింపైన దిగుమతులు........

KJ Staff
KJ Staff

భారత దేశంలో గత కొన్ని నెలలుగా పప్పుదినిసుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సామాన్య ప్రజానీకం పప్పుదినుసులు ఖరీదు చెయ్యాలంటే ఆలోచించేలా ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అదుపు చెయ్యడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఇతర దేశాల నుండి వస్తున్న పప్పు దినుసుల ఎగుమతులను పెంచేందుకు కృషి చేస్తుంది.

మన దేశంలోని రైతుల ధాన్యపు పంటలు ఇచ్చినంత ప్రాధాన్యం పప్పుదినుసుల పంటలకు ఇవ్వరు. తద్వారా పప్పుదినుసులు కొరత ఏర్పడుతుంది. పప్పు దినుసుల పంటల వైపు రైతుల మొగ్గు చూపేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పండించిన పప్పుదినుసులు అధిక ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని హామిఇస్తున్న సరే గత 3 సంవత్సరాల నుండి పప్పుదినుసుల ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది. ఇతర ఆహార ఉత్పత్తులతో పోలిస్తే పప్పుదినుసుల ద్రవ్యోర్బనం అధికంగా ఉంది ప్రస్తుతం పప్పుదినుసుల ద్రవ్యోర్బనం 17% గా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పప్పుదినుసుల ధర ఆకాశానికి చేరుతుంది.

పెరుగుతున్న పప్పుదినుసుల ధరలు నియంత్రించి, దేశంలో ఆహార భద్రత కాపాడేందుకు ప్రభుత్వం ఇతర దేశాల నుండి భారీ మొత్తంలో పప్పుదినుసులు దిగుమతి చేస్తుంది. ఇప్పటివరకు సుమారు 45 లక్షల టన్నుల పప్పుదినుసులు దిగుమతి చేసింది, గత సంవత్సరం దిగుమతి(24.5 లక్షల టన్నులతో) పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువ. దేశ ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా, పప్పుదినుసుల దిగుమతులు మరింత పెంచేందుకు బ్రెజిల్, అర్జెంటీనా, టాంజానియా, మయన్మార్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.

మన దేశంలో, కంది, పెసర, సెనగ, వంటివి ప్రధాన పప్పుదినుసులు. ప్రజలు రోజువారీ ఆహారంలో ధాన్యంతో పాటు, పప్పు దినుసులను కూడా ప్రధానంగా స్వీకరిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా పప్పుదిసుల దిగుబడితో పాటు, వీటిని సాగుచేస్తున్న ప్రాంతం కూడా తగ్గుతూ వస్తుంది. 2021-22 సంవత్సరంలో దేశంలోని 307.31 లక్షల ఎకరాల్లో పప్పుదినుసుల సాగు జరిగితే ఈ ఏడాది 257.85 లక్షల ఎకరాలకు పడిపోయింది. దీని మూలంగా దిగుబడి తగ్గి, పప్పుదినుసుల ధరలో పెరుగుదల మొదలయ్యింది. పప్పుదినుసుల దిగుబడి తగ్గిపోవడానికి, వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ పరిస్థితిని అధిగమించడానికి రైతులు ధాన్యం పంటలతో సమానంగా పప్పు దినుసులను కూడా సాగు చెయ్యాలి. పప్పుదిసుల సాగుకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహాలకాలను వినియోగించుకొని, మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. భిన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడగలిగే పప్పుదినుసుల రకాలను సాగు చేస్తూ ఆశించిన లాభాలను పొందవచ్చు.

Read More:

Share your comments

Subscribe Magazine