News

పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలు.... అధిక ఉష్ణోగ్రతలే కారణమా!

KJ Staff
KJ Staff

ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్మోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూత బయటకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వచ్చే మే నేలలో అధిక ఉష్ణోగ్రతలు కలిగించే హీట్ వేవ్స్ ఉంటాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించి.

అయితే అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ నిత్యావసర వస్తువుల మీద పడనుంది. రానున్న నెలల్లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. హీట్ వేవ్ ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల మీద అధిక ప్రభావం చూపనుంది. అధిక ఉష్ణోగ్రతలు కారణగం పంట దిగుబడిలో తగ్గుదల కనబడనుంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ప్రభావితం కానుంది.


మే నుండి జూన్ మొదటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలియచేసింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ఎండ తీవ్రత ప్రజల మీదనే కాకుండా వ్యవసాయం మీద కూడా పడనుంది. రబీ సీజన్లో పండే పంట ధాన్యాలు, కూరగాయల దిగుబడిలో తగ్గుదల కనిపిస్తుంది. కొన్ని చోట్ల అకాల వర్షాలకు పంట తడిచి పాడైపోయింది. మొన్న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పడిన వర్షాల కారణంగా ఎంతో మంది రైతులు తమ పంట కోల్పొయారు, వరి పండిస్తున్న రైతులు ఎక్కువుగా నష్టపోయారు. అధికంగా నమోదవుతున్న ఎండలకు పాడి పరిశ్రమ కూడా ప్రభావితం అవుతుంది. నీటి లభ్యత, పశుగ్రాసాల అందుబాటులో లేకపోవడం వలన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది.

రానున్న రోజుల్లో కూరగాయలు మరియు పాల ధరల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. శాకాహారంలోనే కాకుండా మాంసాహార ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. అయితే ఈ ఏడాది సానుకూల వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనావేసింది. అయినప్పటికీ వేసవి సమయంలో పండించే పంటల్లో దిగుబడి తగ్గి, ధరల్లో పెరుగుదల కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Share your comments

Subscribe Magazine