News

వ్యసాయం వల్ల గబ్బిలాలకు ముంచియున్న ప్రమాదం......

KJ Staff
KJ Staff

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమయంలో, మనం ఎక్కువగా విన్న పేరు గబ్బిలాలు. గబ్బిలాలను తినడం ద్వారానే మనకు కోవిడ్ వ్యవధి సోకిందని వార్తలు ప్రచారమయ్యేవి. అయితే దీనిలో నిజమెంతో తెలియదు కానీ గబ్బిలాలలు వ్యవసాయానికి ఎనలేని సహాయం చేస్తాయన్న మాట మాత్రం నూటికి నూరు శాతం నిజం.

గబ్బిలాలు సాధారణంగా పగటి పూత కనిపించవు. ఇవి గుంపులు గుంపులుగా చెట్లకు వేలాడుతూ పగటి పూత నిద్రపోతాయి. ఇవి కేవలం రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తూ, ఆహారాన్ని సంపాదిస్తాయి. గబ్బిలాలు విచిత్రమైన జీవులు, వీటికి ఎగిరే స్వభావం ఉన్నా, జీవశాత్రపరంగా క్షిరధాలు , అంటే ఇవి మనుషులు, ఇతర క్షిరదకాల వలే తమ పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. గబ్బిలాలు పక్షుల లాగా గుడ్లు పెట్టావు, నేరుగా పిల్లల్ని పెడతాయి. ఇంకో ఆశక్తీకరమైన విష్యం ఏమిటంటే గబ్బిలాలకు రాత్రి వెళ్లాలో కళ్ళు కనపడవు, ఇవి కేవలం తమ వినుకుడు శక్తీ ద్వారా ఆహారాన్ని వేటాడతాయి.

గబ్బిలాల ద్వారా వ్యవసాయానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వ్యవసాయని పట్టి పీడించే పురుగులు రాతివేళ్లలో ఎక్కువు సంచరిస్తాయి, గబ్బిలాలు కూడా రాత్రివేళల్లోనే వేటాడుతాయి కనుక, ఈ పురుగులను తిని పంట నష్టాన్ని తగ్గిస్తాయి. వరి మరియు పత్తి పంటలో అధిక నష్టం కలిగించే పురుగులను, వేటాడి తింటాయి. కొన్ని నివేదికల ప్రకారం గబ్బిలాలు ప్రతీ ఏటా రైతులకు కొన్ని కోట్లా రూపాయిల వ్యయాన్ని తగ్గిస్తున్నాయి. ఇవి కేవలం పురుగులను వేటాడటమే కాకుండా, కొబ్బరి, జమ, అరటి వంటి పళ్ళ మొక్కల్లో, పరాగసంపర్కం జరపడంలో తోడ్పడతాయి.

అయితే వ్యవసాయానికి ఇంత సహాయం చేస్తున్న గబ్బిలాలకు తీరని నష్టం కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా గబ్బిలాల సంఖ్యా చాల వరకు తగ్గతూ వస్తుంది, దీనికి ప్రధాన కారణం వ్యవసాయంలో విచక్షణ లేకుండా వాడుతున్న పురుగుమందులు. అధిక రసాయన పురుగుమందులు గబ్బిలాల పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనితో పాటు, అడవులను నాశనం చేసి, వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడం ద్వారా, గాబిళ్ళలు మరియు ఇతర పక్షుల నివాసాలు కనుమరుగవుతున్నాయి. వ్యవసాయానికి ఎంతో మేలు చేసే పక్షులు మరియు గబ్బిలాలు అంతరించిపోతే అది తిరిగి మన ఆహార ఉత్పత్తిపైనే ప్రభావం చూపుతుంది. వీటిని సంరక్షించుకోవడానికి, సుస్థిర వ్యవసాయ పద్దతులను ఆచరించడం చాల అవసరం.

Share your comments

Subscribe Magazine