News

వేసవికి నీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

KJ Staff
KJ Staff

రాబోయే వేసవి కాలంలో ప్రజలు నీటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్న్యాన ఏర్పాట్లు చేస్తుంది. మార్చ్ మొదటి వారం నుండే ఎండలు ముదిరి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్యలు ఎదురుకుంటున్నారు. నీటి సమస్యలు ఉద్రిక్తం కాకూండా అధికారు ముందస్తు చర్యలుగా ప్రత్యామ్నాయ నీటి వనరుల మీద ద్రుష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో మరమత్తులు లేక నిర్వీర్యంగా పడి ఉన్న బావులను, చేతి పంపులను అధికారులు మెరుగుపరిచే యత్నం చేస్తున్నారు

గత ఏడాది సెప్టెంబర్ తర్వాత ఉహిచినంత రీతిలో వర్షపాతం లేనందువల్ల, భూగర్భ జలాలలో తగ్గుదల కనిపించింది. అలాగే ఎక్కువ వర్షపాతం లేన్నందు వల్ల జలాశయాలు నిండలేదు. భూగర్భ జలాలు లేక చేతి పంపులు, బావులు ఎండిపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారులు అందుబాటులో ఉన్న నీటి వనరులను బాగుపరిచే పనిలో పడ్డారు. మరమత్తులు లేని బావులను, చేతిపంపులను గుర్థించి మళ్ళి వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రురల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ, పంచాయితీ రాజ్, అధికారులు, రోజువారీ నీటి వినియోగాన్ని, నీటి నిర్వహణ పద్దతులను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో, 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రాబోయే ఏప్రిల్ మరియు మే నెలల్లో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండా తీవ్రత ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు, జలాశయంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం గత ఏడాది, ఫిబ్రవరి నాటికీ భూగర్భ జలాల్లో 7.3 మీటర్ల నీటి మట్టం ఉంటె ఈ ఫిబ్రవరి కి 8.7 మీటర్లకు చేరింది. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదయినందున వచ్చే మే నాటికి భూగర్భ జలాల్లో తగ్గుదల కనిపించవచ్చు.

నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున, అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసారు. రాష్ట్రంలో నీట్ సమస్యలు తలెత్తకుండ చర్యలు చేపట్టడానికి, రాష్ట్రాలకు తగు నిధులను విడుదల చేసినట్లు సిఎస్ శాంత కుమారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లో సరిపడా నీరు ఉన్నందున, ప్రస్తుతం తాగునీటి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు, కానీ రానున్న వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరాపై ద్రుష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Share your comments

Subscribe Magazine