News

AP: కౌలురైతుల్లో అతికొద్ది శాతం మాత్రమే CCRC కి నమోదు.

KJ Staff
KJ Staff


కౌలు రైతులకు, భూయజమానులకు వాలే సమాన హక్కులను కల్పించడానికి పంట సాగు దారుల హక్కు కార్డు(CCRC). ఆంధ్ర ప్రదేశ్లో కౌలు రైతుల సంఖ్యా 16 లక్షలకు పైమాటే. సీసీఆర్సి కార్డు కలిగి ఉన్న కౌలు రైతులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పధకాలు పొందడానికి అర్హులు, అలాగే పంట నష్టానికి అందించే నష్టపరిహారాన్ని, మరియు సబ్సిడీలను పొందడానికి వీలుంటుంది.

కౌలు రైతులకు కూడా సమాన హక్కులు కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019 జులై లో పంట సాగు దారుల కే=హక్కు చటానికి ఆమోదం తెలిపింది. కానీ నాబార్డ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం కేవలం 33% కౌలు రైతుల వద్ద మాత్రమే సీసీఆర్సి కార్డు కలిగి ఉన్నారు. భూమి యజమానులు కౌలు రైతులకు ఈ కార్డు రావడానికి సహకరించకపోవడమే ప్రధాన కారణమని నాబార్డ్ ప్రస్తావించింది. పంట సాగుదారు హక్కు చటం ప్రకారం భూయజమానులు కౌలు రైతులకు తమ భూమిని కౌలుకు ఇస్తున్నట్టు ధృవీకరించే దస్తావేజుపై సంతకం చేయవల్సి ఉంటుంది కానీ ఎంతోమంది యజమానులు ఈ ఒప్పందానికి నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉంటె ఎంతో మంది కౌలు రైతులకు ఈ చటం పైన అవగాహనా లేక సీసీఆర్సి కార్డు కొరకు నమోదు చేసుకోలేదు.

ఇప్పటివరకు సీసీఆర్సి పొందిన కౌలు రైతుల్లో అధిక శాతం తూర్పు గోదావరి జిల్లా వారు కావడం విశేషం, ఈ జిల్లాలో 54.1% రైతులు సీసీఆర్సి కార్డు కలిగి ఉన్నారు అదే క్రమంలో గుంటూరు 48.70%, కృష్ణ 42.42%, పశ్చిమ గోదావరి 39.25% కౌలురైతులు సీసీఆర్సి చట్టం ద్వారా నమోదై ఉన్నారు. అయితే అన్ని జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూర్ 1.41% శాతం, అనంతపురం 5.11% మరియు శ్రీకాకుళం 10.23% శాతం ఈ జిల్లాలో తక్కువ కౌలు హక్కు కోసం నమోదు చేసుకున్నారు.

Share your comments

Subscribe Magazine