News

ఎమ్మెల్యే కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

భారత దేశం మొత్తం లోకసభ ఎన్నికలు జారుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్లో లోకసభ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల నామినేషన్లు ఏప్రిల్ 18 నుండి స్వీకరరించడం మొదలుపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని పార్టీల నేతలు నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్లు ఏప్రిల్ 25 వరకు స్వీకరిస్తారు. అయితే నామినేషన్స్ వేసే అభ్యర్థులకు ఎటువంటి అర్హతలు ఉండలి?, ఎమ్మెల్యే కావడానికి ఎవరు అర్హులు ఎవరుకారు?ఇటువంటి ప్రశ్నలు మనలో చాలామందికి వచ్చే ఉంటాయి. ఇప్పుడు వీటిని నివృత్తి చేసుకుందాం.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయ్యాలనుకునే అభ్యర్థులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, కొన్ని పత్రాలతో కూడిన నామినేషన్ సమర్పించాలన్న విషయం మనందరికీ తెలుసు. నామినేషన్స్ వేసే అభ్యర్థులు కచ్చితంగా 25 సంవత్సరాలు నిండి భారతీయ పౌరులై ఉండాలి, మరియు ఓటుహక్కు కలిగి ఉండటం తప్పనిసరి, అందుకు సంబంధించిన ధ్రువ పాత్రలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ఒకరాష్ట్రంలో ఓటు హక్కు కలిగి మరొక్క రాష్ట్రంలో పోటీచేయ్యడం కుదరదు.

నామినేషన్స్ వేసే అభ్యర్థులందరికీ ఇతరుల ప్రతిపాదన అవసరం, ఇలా ప్రతిపాదించే వ్యక్తిని ప్రపోజర్ అంటారు. అభ్యర్థులను బట్టి ఎంత మంది ప్రపోజర్స్ ఉంటాలో సూచిస్తారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ నుండి కానీ, రాష్ట్రీయ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు కనీసం ఒక్క ప్రపోజర్ ఉండాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కనీసం 10 మందైనా వారి అభ్యర్దిత్వాని ప్రతిపాదించాలి. అంతేకాకుండా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ పొంది, గుర్తింపు లేని పార్టీ తరపున పోటీచేసే వారికి కూడా 10 మంది ప్రపోజర్స్ ఉండాలి. ప్రతీపాదించే ప్రపోజర్లు తమ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండలి, అలా కనుక లేనట్లయితే వారి అబ్యర్ధన చెల్లదు, ఇటువంటి సందర్భాల్లో నామినేషన్స్ వెంటనే తిరస్కరించే అధికారం రిటర్నింగ్ ఆఫీసర్ కు ఉంది.

ఇప్పుడు తరచు మనం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఆస్తివివరాలను గురించి వార్తల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం. నామినేషన్ సమయంలో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కేసులు, సంబంధిత వివరాలను నోటరీ చేసి అఫిడవిట్ సమర్పించాలి. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు రాజ్యాంగానికి, సార్వభౌమాధికారాన్ని కట్టుబడి ఉంటానని రాత పూర్వకంగా ప్రమాణం చేసి వాటిని ఇతర డాక్యూమెంటల్తో పాటు సమర్పించాలి. ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి పోటీచేసే అభ్యర్థులు ఆ సామజిక వర్గానికి చెందినవారై ఉండటం తప్పనిసరి. దినికి సంభందించిన కులధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కి అందించాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గానికి చెందిన అభ్యర్థులు జనరల్ క్యాటగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీచేసేందుకు వీలుంటుంది.


డిపాసిట్లు కోల్పోవడం అంటే ఏమిటి?

సాధారణంగా ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఓడిపోతే డిపాసిట్లు కూడా దక్కలేదు అనంటారు ఎందుకంటే, నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు డాక్యూమెంట్లతో పాటు కొంత మొత్తం సెక్యూరిటీ డిపోసిట్ చెయ్యాలి. ప్రతి అభ్యర్థి 10 రూ సెక్యూరిటీ డిపోసిట్ చెయ్యాలి, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 5,000 సెక్యూరిటీ డిపోసిట్ చెలిస్తే సరిపోతుంది. ఈ డిపోసిట్ తిరిగిపొందడానికి పోటీ అభ్యర్థులు పోటీచేసిన నియోజకవర్గంలో, ఆరింట ఒకవంతు శాతం ఓట్లు సాదించాలి, లేదంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయినట్టే. అందుకే తక్కువ మొత్తంలో ఓట్లు పొందిన అభ్యర్థులును డిపాజిట్ కూడా పొందలేదని అంటారు.

Share your comments

Subscribe Magazine