News

ఈ మసాలాలు ఆ దేశంలో బంద్...! కారణం ఇదే...

KJ Staff
KJ Staff

భారత దేశంలోని ప్రముఖ మసాలా ఉత్పత్తి ధారులైన ఎవరెస్ట్(Everest) మరియు ఎండిహెచ్ (MDH) మసాలా ఉత్పత్తులను కొన్ని దేశాల్లో బ్యాన్ చేసారు. ఇప్పుడు సింగపూర్ కూడా ఆ జాబితాలో చేరింది. ఇకనుండి సింగపూర్లో ఈ రెండు సంస్థలకు చెందిన మసాలా ఉత్పత్తుల విక్రయాలు ఉండబోవని ఆ దేశాలు తేల్చి చెప్పాయి. పూర్తి వివరాలు ఇవే....

మన భారత దేశం మసాలా వంటకాలకు పెట్టింది పేరు. మన దేశం లోనే కాకుండా ఇతర దేశాల ప్రజలుకూడా మన వంటకాలను ఇష్టపడటానికి మసాలా వంటకాలే కారణం. మన దేశంలో మసాలాలు ఉత్పత్తి చేసే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లోని ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఈ మసాలాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఉత్పత్తయిన మసాలాలు అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఈ తరుణంలోనే ప్రముఖ భారతీయ మసాలా ఉత్పత్తిదారులైన ఎవరెస్ట్ మరియు ఎండిహెచ్ కంపెనీలకు చిక్కెదురైంది. సింగపూర్ ప్రభుత్వం ఈ రెండు మసాలా బ్రాండ్లను తమ దేశంలో బ్యాన్ చెయ్యనుంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ఈ బ్రాండ్ మసాలాలు అమ్మకాలు నిషిద్ధం. అయితే తాజాగా సింగపూర్ కూడా ఈ జాబితాలో చేరింది.

హాంగ్కోంగ్ ఫుడ్ రేగులటరీ అథారిటీ కొన్ని ఆహార పదార్ధాల మీద ఆహార తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా భారతీయ మసాలా ఉత్పత్తులను పరిశీలించింది. ఈ తనిఖీల్లో రెండు ప్రముఖ మసాలా బ్రాండ్లు, ఎవరెస్ట్, ఎండిహెచ్ మాసాలలో 'ఎథిలిన్ ఆక్సైడ్' ఉన్నట్లు గుర్తించింది. పురుగుమందుల్లో వాడే ఈ ఇథలిన్ ఆక్సైడ్ మనిషి ఆరోగ్యానికి ప్రాణాంతకమైనది. ఈ కెమికల్ కార్సినోజెన్ లాగా పరిగణిస్తారు అంటే ఇది మనుషుల్లో కాన్సర్ రవాడనైకి కారణమవుతుంది.

ఈ నివేదికకు స్పందించిన సింగపూర్ ప్రభుత్వం వెంటనే ఈ రెండు కంపెనీల మసాలా ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ మసాలా అమ్మకాలు నీపివెయ్యాలని వ్యాపారస్తులకు సూచించింది. వెంటనే వీటి దిగుమతి కూడా నిలిపివెయ్యాలని డీలర్లకు తెలియచేసింది. ఇప్పటికే అమెరికాలో ఎవరెస్ట్ బ్రాండ్ సాంబార్ మసాలా, గరం మసాలా మరియు మ్యాగీ మసాలాలను అక్కడి ప్రభుత్వం నిషేధించి. ఈ మాసాలల్లో సాల్మొనెల్లా ఉత్పత్తులు ఉండటమే దీనికి ప్రధాన కారణం. వినియోగదారుల రక్షణను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Share your comments

Subscribe Magazine