News

AIR TAXI: ఇండియాలో ప్రారంభంకానున్న ఎయిర్ ట్యాక్సీ సేవలు

KJ Staff
KJ Staff

ఇప్పటివరకు మన దేశంలో ప్రయాణ సౌకర్యల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. మునుపటి కాలంలో ఉపయోగించిన ఎడ్ల బళ్ల దగ్గర నుండి, నేడు వందే భారత్ వరకు రవాణా మార్గాల్లో పెను మార్పులు సంభవించాయి. ప్రయాణాన్ని వేగవంతం మరియు సులభతరం చెయ్యడానికి, రవాణా సంస్థలు అనునిత్యం నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ సందర్భంలోనే భారత దేశంలో ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఇండిగో, భరత్ లో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

2026 నాటికి భారత దేశంలో ఎయిర్ టాక్సీ సేవలు అందిచడానికి ఇండిగో సంస్థ ప్రయత్నిస్తుంది. దీనికి సంభందించి, అమెరికాలోని ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఆర్చర్ ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2026 లో భారత్లోని ముఖ్య పట్టణాల్లో ఎయిర్ టాక్సీ సేవలు మొదలుపెట్టే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు, ఇండిగో మాతృ సంస్థ ఇంటెర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం మన దేశంలో, పలు సంస్థలు ప్రజలకు రవాణాను సులభతరం చేసాయి, ఇంట్లోఉండే క్యాబ్ లేదా బైక్ చేసుకునే సౌరకార్యం ఉన్న అప్స్ అందుబాటులో ఉన్నాయి. బుక్ చేసుకున్న కొద్దీ క్షణాల్లోనే, బైక్, క్యాబ్, ఆటో మన గుమ్మం ముందుకు వచ్చి గమ్యస్థానాలకు సులభంగా చేరుస్తున్నాయి. అయితే ప్రతిఒక్కరు తమ ప్రయాణాలకు సొంత వాహనాలను వాడుతుండటం వలన ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుంది, పెద్ద నగరాల్లో జనాల ట్రాఫిక్ కష్టాలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వాహనాలు పెరగడంతో పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది

అయితే ఈ సమస్యలు తగ్గించి, అనుకున్న గమ్య మార్గాలకు వేగంగా మరియు సురక్షితంగా చేర్చడానికి మొదలుపెట్టినవే ఎయిర్ టాక్సీలు. ఇప్పటికే చాల దేశాల్లో ఈ ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ, ఆర్చర్ ఏవియేషన్ తో ఒప్పనడం కుదుర్చుకుని 2026 నాటికల్లా భరత్ లో ఎయిర్ టాక్సీ సేవలు మొదలుపెట్టనుంది. దీని కోసం ఇండిగో సంస్థ మొత్తం 8,300 కోట్లా రూపాయిలు ఖర్చు చెయ్యనుంది.

టేకాఫ్ మరియు లాండింగ్ కి అనుగుణంగా ఉండే 200 ఎయిర్ టాక్సీలను, ఆర్చర్ ఏవియేషన్ అందించనుంది, వీటిలో మరొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇవి విద్యుత్తుతో నడిచే వాహనాలు కనుక పర్యావరణ కాలుష్యం ఉండదు. ఈ ఎయిర్ ట్యాక్సీ 6 బ్యాటరీలతో రానుంది, మొత్తం ఛార్జ్ కావడానికి 30-40 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎయిర్ టాక్సీలలో పైలట్ తో పాటు నాలుగు పేసెంజర్స్ ప్రయాణం చేసే విధంగా రూపొందించబడినవి. వీటిలో ప్రయాణించడానికి 2000-3000 రూపాయిల వరకు ప్రారంభ రుసుము ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఎయిర్ ట్యాక్సీలు ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి, ముపై కిలోమీటర్ల గమ్యాన్ని కేవలం 7 నిమిషాలలోనే కవర్ చెయ్యగలవు. మొదట ఢిల్లీ, బెంగుళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలను చేస్తున్నారు. ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రయాణ రంగంలో మరో మైలు రాయిగా నిలవనున్నాయి.

Share your comments

Subscribe Magazine