Farm Machinery

డిసిజిఏ అనుమతి పొందిన 'సూర్య శక్తీ 15L డ్రోన్'

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో సాంకేతికత స్థిర వేగంగా అభివృద్ధి చెందుతుంది. వ్యవ్యసాయ యాంత్రీకరణ వ్యవసాయంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ త్రోవ లోనే ఎయిర్బోట్స్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన సూర్య శక్తీ 15L డ్రోన్ వాడుకలోకి రానున్నది. ఈ డ్రోన్ డిసిజిఏ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన ఎయిర్బోట్స్ ఏరోస్పేస్ అనే స్టార్ట్ అప్ కంపెనీ, వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా వివిధ రకాల డ్రోన్లు వ్యవసాయ యంత్రాలు అభివృద్ధి చేస్తుంది. పైరు పై మందులు చాల్లే విధానాన్ని పూర్తిగా యాంత్రీకరించడం కోసం ఈ కంపెనీ నిర్విరామ కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ వారు అభివృద్ధి చేసిన సూర్య శక్తీ డ్రోన్, డిసిజిఏ టైపు సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా యిర్బోట్స్ ఏరోస్పేస్ సీఈఓ విశాల్ కపాడియా మాట్లాడుతూ, తమ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ సహాయంతో రైతులకు, వ్యవసాయంలో ఎంతో సహాయపడనుందని, తెలిపారు. సూర్య శక్తీ డ్రోన్ డిసిజిఏ సర్టిఫికెట్ పొందడానికి డ్రోన్ లోని ప్రత్యేకత కారణమని మరియు ఈ ఘనత సాధించడానికి, నిర్విరామ కృషి మరియు పట్టుదల తోడయ్యాని తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, రైతుల లాభాలను పెంచడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా తమ ఉత్పత్తులు ఉంటాయని అన్నారు.

సూర్య శక్తీ డ్రోన్ 15 లీటర్ల ట్యాంక్ సామర్ధ్యంతో అందుబాటులోకి రానున్నది. అత్యుత్తమ ప్రమాణాలతో, వ్యవసాయ పురోగతిని పెంచే విధంగా ఈ డ్రోన్ రూపుదిద్దుకోబడింది. వ్యవసాయంలో వచ్చే చీడపీడల నివారణకు రైతులు పురుగుమందులు ఎక్కువుగా వాడుతున్న విష్యం తెలిసిందే, దీని కారణంగా మనం తినే ఆహారం కలుషితం కావడంతో పాటు, పర్యావరణానికి కూడా కీడు కలుగుతుంది. రసాయన మందులు పిచికారీ చేసే సమయంలో సరైన రక్షణ పద్ధతులు పాటించకపోవడం వలన రైతులు అస్వస్థతకు గురవుతున్నారు. మందుల పిచికారికి డ్రోన్లను వినియోగించడం ద్వారా, రైతుల ఆరోగ్యం దెబ్బతినదు మరియు కొద్దీ సమయంలోనే ఎక్కువ ప్రాంతంలో సమర్ధవంతంగా, డ్రోన్ మందులను పిచికారీ చెయ్యగలదు.

సూర్య శక్తీ డ్రోన్ లో అమర్చిన కొన్ని ప్రత్యేకమైన సెన్సార్ల్ మూలంగా, పొలంలో ఎక్కడైతే పురుగులు, రోగుల ఉదృక్తి ఎక్కువుగా ఉందొ అక్కడే మందులు పిచికారీ చేసే విధంగా ఈ డ్రోన్ రూపొందించబడింది. తద్వారా రసాయన మందుల వినియోగాన్ని చాల వరకు కట్టడి చెయ్యవచ్చు. ఈ డ్రోన్ 15 లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకుతో వస్తుంది, మరియు 24 నిమిషాల ఫ్లైట్ టైం కలిగి ఉంటుంది. ఒకసారి చార్జీ చేస్తే మూడు ఎకరాల పొలంలో ముడులు పిచికారీ చేసే సామర్ధ్యం ఈ డ్రోన్కు ఉంది. 5G కన్సెటివిటీతో వస్తుంది కనుక ఫ్లైట్ సమయంలో డ్రోన్ మీద మంచి నియంత్రణ పొందవచ్చు అంతేకాకుండా రియల్ టైం సెన్సింగ్ ద్వారా పొలం డేటా పొందవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ డ్రోన్ని తక్కువ ధరకే రైతులకు అందించడానికి ఎయిర్బోట్స్ ఏరోస్పేస్ కంపెనీ ప్రయత్నిస్తుంది. అన్ని రకాల పంటల స్ప్రేయింగ్ అవసరాలకు తగ్గట్టుగా ఈ డ్రోన్ ఉండబోతుంది.

Share your comments

Subscribe Magazine