Farm Machinery

డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలు మరియు ఫెర్టిగేషన్ విధానంలో మెళుకువలు

KJ Staff
KJ Staff

నీటి లభ్యత తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో పంటలు పండించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇటువంటి ప్రాంతాల్లోని రైతులు ఎక్కువుగా వర్షాధారిత పంటలను సాగుచేస్తారు. కొద్దోగొప్పో నీరు అందుబాటులో ఉన్న అది పంట మొత్తానికి అందించడం సాధ్యపడదు. ఇటువంటి వారికి డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) ఒక వరం వంటిది.

డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా పంటలు పండించవచ్చు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో డ్రిప్ ఇరిగేషన్ ఒకటి. బిందు సేద్యం ద్వారా నీటి వృథా తగ్గుతుంది. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులను అందించడం తేలిక.

డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులను అందించే పద్దతిని 'ఫెర్టిగేషన్' అని పిలుస్తారు. ఫెర్టిగేషన్ ద్వారా ఎరువుల నేరుగా మొక్కలకు అందించవచ్చు. ఎరువులు నీటిలో కలిపి ఇవ్వడం ద్వారా, మొక్కలకు నీటితో పాటు పోషకాలు కూడా నేరుగా అందుతాయి. తద్వారా పంట మంచి దిగుబడిని ఇస్తుంది, పైగా ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది.

సాధారణ పద్దతిలో ఎరువుల వినియోగ సామర్ధ్యం తక్కువుగా ఉంటుంది. సాధారణ పద్దతిలో నత్రజని-50% భాస్వరం -20%, పొటాషియం-50% పంటకు ఉపయోగపడితే డ్రిప్ విధానంలో నత్రజని 90-95%, భాస్వరం-45%, పొటాషియం-80% వినియోగ సామర్ధ్యం ఉంటుంది.

ఫెర్టిగేషన్లో అనుసరించవల్సిన నియమాలు:

ఫెర్టిగేషన్ విధానంలో రైతులు, నేలను బట్టి మరియు పంట రాకని బట్టి ఎరువులను అందించాలి. తేలిక పాటి నెలల్లో నీరు తొందరగా ఇంకిపోతుంది కనుక రెండురోజులు ఒకసారి నీతితో పాటు ఎరువులు అందించాలి, అదే నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం అధికంగా ఉన్న నల్లరేగడి నెలల్లో వారానికి ఒకసారి ఎరువులు అందిస్తే సరిపోతుంది. అయితే ఫెర్టిగేషన్ ద్వారా అన్ని రకాల ఎరువులను అందించడం సాధ్యం కాదు, నీటిలో పూర్తిగా కరిగే సామర్ధ్యం ఉన్న ఎరువులను మాత్రమే ఉపయోగించగలం. అమ్మోనియం ఎరువులను అధికంగా వాడితే డ్రిప్ పైపుల్లో నాచు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం తరచు డ్రిప్ లైన్లను పరిశీలిస్తూ ఉండాలి.

 

యూరియా, డిఏపి, తేలికగా నీటిలో కరిగి మొక్కకు అవసరమైన నత్రజనిని అందిస్తాయి. పొటాషియం ఎరువుల్లో, మ్యురేట్ ఆఫ్ పోటాష్, సల్ఫేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను వినియోగించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో డ్రిప్ ఇరిగేషన్కు అనుగుణంగా ద్రవ రూపంలో ఉండే ఎరువులు అందుబాటులో ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కూడా డ్రిప్ పద్ధతి ద్వారా పోషకాలను అందించవచ్చు. సేంద్రియ ద్రావణాలను అందించే ముందు వాటిని వడగట్టి అందిచాలి లేదంటే డ్రిప్పర్లు ముసుకుపోయే అవకాశం ఉంటుంది.

డ్రిప్ ద్వారా సూక్ష్మపోషక ఎరువులను అందించే సమయంలో ఇతర రసాయన ఎరువులతో కలపడం నిషిద్ధం, ఇలా చెయ్యడం ద్వారా సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందకుండా వృధాగా పోతాయి. ఈ విధంగా డ్రిప్ పద్ధతిని సరైన విధానంలో ఉపయోగించుకుంటే పంటల దిగుబడి మరియు నాణ్యత పెరుగుతాయి.

Share your comments

Subscribe Magazine