Farm Machinery

వాడండి స్థిల్ పవర్ టిల్లర్... మరియు పొందండి మెరుగైన పనితీరు, రేటింపు దిగుబడి

KJ Staff
KJ Staff

ప్రవేశపెడుతున్నాం కొత్త స్థిల్ పవర్ పవర్ టిల్లర్, అధునాతన డిజైన్, వాడటానికి తేలికగా ఉంటూ, శక్తివంతమైన పనితీరు కనబరుస్తూ, మీ వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించడంలో సహాయపడుతుంది.

ప్రారంభంగా గొప్పగా ఉంటె ఫలితం కూడా గొప్పగా ఉంటుందని నానుడి, అనుకున్న విజయాన్ని సాధించాలంటే ప్రారంభం నుండే అనుకూలతలను పెంచుకుంటూ ముందుకు సాగాలి. వ్యవసాయంలో కూడా ఇది వర్తిస్తుంది. మీరు  వ్యవసాయంలో ఆశించిన దిగుబడి పొందాలంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా వ్యవసాయ పద్దతుల్లో మార్పులు చెయ్యాలి. ప్రస్తుతం అన్ని వ్యవసాయ అవసరాలకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడం ద్వారా మీ శారీరిక శ్రమ తగ్గడమే కాక వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరుగుతుంది.

వ్యవసాయం ప్రారంభించే ముందు పంటకు తగ్గట్టు మట్టిని సిద్ధం చేసుకోవడం అనేది రైతులకు ఎదురయ్యే మొదటి సవాలు. సాంప్రదాయ పద్దతిలో మట్టిని దున్నడం శారీరిక మరియు మానసిక శర్మతో కూడుకుని ఉంటుంది. మట్టిని దుక్కిదున్నడానికి ఉపయోగపడే ఎన్నో పవర్ టిల్లర్  యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మీరుకూడా మీ వ్యవసాయ అవసరాల కోసం పవర్ టిల్లర్ ఖరీదు చెయ్యాలనుకుంటే స్థిల్ ఇండియా వారు  అందుబాటులోకి తీసుకువచ్చిన MH 710 మరియు MH 610 మోడల్ పవర్ టిల్లర్లు ఒక మేలైన ఎంపికగా నిలుస్తాయి. మీ యొక్క అన్ని వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన ఈ పవర్ టిల్లర్లు మెరుగైన పనితీరును మారియు రాజీపడని నాణ్యతను మీకు అందిస్తాయి.

స్థిల్ MH 610 పవర్ టిల్లర్ లక్షణాలు: (Features of STIHL MH 610 Power Tiller)

 

స్థిల్ ఇండియా వారి MH 610 పవర్ టిల్లర్ సింగల్ సిలిండర్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ తో మీకు లభిస్తుంది. MH 610 ఎయిర్-కూల్ల్డ్  ఇంజిన్ 6 హార్స్ పవర్ ఉత్పత్తి చెయ్యగలదు, చిన్న వ్యవసాయ  అవసరాలకు మరియు గార్డెనింగ్ అవసరాలకు ఈ టిల్లర్ అనువుగా ఉంటుంది. 3.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తో రావడం మూలాన, ఒక్కసారి ఇంధనం నింపితే చాలా సమయంవరకు పనిచేస్తుంది. స్థిల్ MH 610 పవర్ టిల్లర్ యొక్క బరువు 60 కేజీలు, దీని సహాయంతో 78 సెంటీమీటర్ల వైశాల్యం, మరియు 5 ఇంచుల లోతు వరకు మట్టిని దున్నుకోవచ్చు. ఈ పవర్ టిల్లర్ లో మొత్తం రెండు ముందు గేర్లు మరియు ఒక వెనుక గేరు ఉన్నాయి. వివిధ వ్యవసాయ అవసరాలకు మరియు గార్డెనింగ్ అవసరాలకు తగ్గట్టు పనిముట్లు అమర్చుకునే  సౌలభ్యం  ఉంది.

స్థిల్ MH 710 పవర్ టిల్లర్ లక్షణాలు: (Features of STIHL MH 710 Power Tiller)

 

స్థిల్ ఇండియా వారి MH 710 పవర్ టిల్లర్ కూడా సింగల్ సిలిండర్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ తో మీకు లభిస్తుంది. MH 710 ఎయిర్-కూల్ల్డ్  ఇంజిన్ 7 హార్స్పవర్ ఉత్పత్తి చెయ్యగల సామర్ధ్యం కలిగి ఉంది. స్థిల్ MH 710 కూడా 3.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తో వస్తుంది, కాబట్టి  ఒక్కసారి ఇంధనం నింపి ఎక్కువసేపు పనిచేసుకునే వీలుంటుంది. స్థిల్ MH 710 పవర్ టిల్లర్ యొక్క బరువు 101 కిలోగ్రాములు, ఈ టిల్లర్ సహాయంతో  91 సెంటీమీటర్ల వైశాల్యం, మరియు 6 ఇంచుల లోతు వరకు మట్టిని దున్నుకోవచ్చు. ఈ పవర్ టిల్లర్ లో మొత్తం రెండు ముందు గేర్లు మరియు ఒక వెనుక గేరు ఉన్నాయి. వివిధ వ్యవసాయ అవసరాలకు మరియు గార్డెనింగ్ అవసరాలకు తగ్గట్టు పనిముట్లు అమర్చుకునే  సౌకర్యం  ఉంది.

 

స్థిల్ MH 610 మరియు MH 710 పవర్ టిల్లర్ల ప్రత్యేక లక్షణాలు:

 

ప్రస్తుతం చాల ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కూలీలు దొరక్క, వ్యవసాయ పనులు ఆలస్యం అవుతున్నాయి దీనితో దిగుబడి తగ్గి రైతులు నష్టం చవిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను అధిగమించి, ఎవరి సహాయం లేకుండా పంటలు పండించడానికి వ్యవసాయ యంత్రాల అవసరం ఎంతైనా ఉంది. స్థిల్ కంపెనీ అందిస్తున్న ఈ పవర్ టిల్లర్ ఉపయోగించి మీ వ్యవసాయ పనులన్నీ సులభంగా పూర్తిచేసుకోవచ్చు.

స్థిల్ వారి MH 610 మరియు MH 710 కఠినమైన వ్యవసాయ పనులన్ని సులభంగా పూర్తిచేస్తాయి. అడ్జెస్టబుల్ గ్రిప్ హ్యాండిల్ సౌకర్యంతో రావడం వలన మీ అవసరాలకు తగ్గట్టు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పవర్ టిల్లర్ తక్కువ కంపనం ఉత్పత్తి చెయ్యడం వలన పనిచేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మట్టిని దున్నడం, మరియు మట్టిని లెవెల్ చేయడం వంటి పనులన్నీ ఈ పవర్ టిల్లర్ సులభంగా చేసేస్తోంది.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More