News

వేసవిలోనూ పత్తి సాగు....

KJ Staff
KJ Staff

పత్తి ఉత్పత్తి చెయ్యడంలో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రధానంగా పండించే ధాన్యంతో సమానంగా పత్తి ని కూడా అధిక మొత్తంలో సాగుచేస్తారు. అయితే పత్తి సాగు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో ప్రారంభిస్తారు. పత్తి ఉత్పత్తిని పెంచి రైతులకు ఆద్యం సమకూర్చాలన్న ఉదేశ్యంతో యాసంగిలో కూడా పత్తి సాగు చేయించేందుకు సన్నాహాలుచేస్తుంది.

నిజానికి పత్తిని వానాకాలంలో సాగుచేస్తారు. అదే సమయంలో పత్తికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని మూలంగా పత్తిని యాసంగిలో పండించేందుకు అధికారులు సంసిద్ధం అవుతున్నట్లు తెల్సుతుంది. తెలంగాణాలో సాధారణంగా యాసంగిలో వరి సాగు విస్తృతంగా జరుగుతుంది. అయితే వరి సాగుచెయ్యాలంటే నీరు ఎక్కువుగా అవసరం ఉంటుంది. యాసంగిసమయంలో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. కనుక వరికి బదులు పత్తిని సాగుచెయ్యాలని వ్యవసాయ అధికారులు రైతాంగానికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఇప్పటికే భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) అనుమతి కోసం కోరింది.

యాసంగిలో పత్తి సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తి సాగుకు అవసరమైన విత్తనాలు సిద్ధం చెయ్యాలని, ప్రైవేట్ కంపెనీలను కోరినట్లు తెలుస్తుంది. వానకాలంలో పత్తి సాగుకు, వర్షాలు మరియు చీడపీడలు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. అయితే వానకాలంలోనే పత్తికి అధిక మద్దతు ధర లభించడం విశేషం. దీనిని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో కొద్దీ ప్రాంతంలో పత్తి సాగు జరపాలని అధికారులు నిర్ణయించారు. యాసంగిలో పత్తి సాగును అధిక ఉష్ణోగ్రతలు దెబ్బతీసే అవకాశం ఉంది. కొన్ని జాగ్రతలు పాటించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించి మంచి లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More