News

పప్పుదినుసుల వృథాను తగ్గించాలి: ఐసిఏఆర్ నేషనల్ స్టీరింగ్ కమిటీ

KJ Staff
KJ Staff

తృణ ధాన్యాలు నిలువ చేసే సమయంలో వృథాను తగ్గించి ఆహార భద్రత పెంచాలనే అంశం మీద చర్చిండానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలో నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యలు సమావేశమయ్యారు. పంట కోత కోసిన తర్వాత జరుగుతున్న ఆహార వృథాను తగ్గించడానికి నూతన ఆవిష్కరణలను వినియోగించాలన్న విష్యం మీద చర్చిండం జరిగింది.

శరీర అభివృద్ధికి మాంశకృతులు ఎంతో అవసరం, ఇటువంటి మాంశకృతులు అందించడంలో తృణ ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గత కొంత కాలంగా భారత దేశంలో తృణధాన్యాల సాగు తగ్గుతూ వస్తుంది, పప్పు దినుసులు కొరత ఏర్పడింది, దీని మూలంగా వీటి ధర పెరిగి సామాన్యుని పై ఆర్ధిక భారం పడుతుంది. పప్పు దినుసుల దిగుబడి తగ్గడంతో పాటు పండించిన పంటలో చాల భాగం నిల్వ చేసే సమయంలో వృథా జరుగుతుంది. సరైన నిలవసామర్ధ్య పద్ధతులు లేకపోవడమే, పప్పు దినుసులు వృథా కావడానికి ప్రధాన కారణం.

ఈ పరిస్థితిని నియంత్రించి, పప్పుదినుసుల లభ్యతను పెంచడం ఇప్పుడు అధికారుల ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ సెంటర్ లో, నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశం మే 6-7 వరకు జరిగింది. ఈ సందర్భంగా ఐసిఏఆర్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్యూటీ డ్రైరెక్టర్ జనరల్ డా.ఎస్.ఎన్ ఝ మాట్లాడుతూ, తృణధాన్యాల లభ్యత పెంచడానికి, నిల్వ చేసే సమయంలో దీని వృథాను తగ్గించాలని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన యంత్రాలను అభివృద్ధి చెయ్యాలని తెలిపారు. అనంతరం వినియోగదారు వ్యవహారాల శాఖ ఆర్ధిక సలహాదారు డా. కే. గైట్, మాట్లాడుతూ, ప్రజల అవసరాలు తగ్గట్టు తృణ ధాన్యాలను నిల్వ చేస్తూ భవిష్యత్తు అవసరాల కోసం అదనపు నిలువలు నిర్వహించే సామర్ధ్యం కలిగి ఉండాలని ప్రస్తావించారు.

 

Share your comments

Subscribe Magazine