News

ఎదుటివారి మైండ్ కంట్రోల్ చేసే డ్రగ్

KJ Staff
KJ Staff

ప్రపంచంలో చాల మంది మత్తుమందుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, మరీముఖ్యంగా యువత ఈ వ్యసనాన్ని అలవరచుకుని, ఈ మత్తు నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇటువంటి వారికోసం ప్రభుత్వం రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రారంభించింది, మత్తుమందులకు బానిసైన వారికి చికిత్స అందిస్తుంది. ఈ మధ్యకాలంలో మత్తు మందుల సహాయంతో కొందరు కేటుగాళ్లు విచ్చలవిడిగా దొంగతలను చేస్తారు. స్కోపోలమైన్ అనే డ్రగ్ ఉపయోగించి ఎదుటువారి మైండ్ ని కంట్రోల్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.

స్కోపోలమైన్ అనే ఈ డ్రగ్ సింథటిక్ గా తయారుచెయ్యబడుతుంది. దీని కొన్ని రకాల మందుల తయారీలో వాడతారు. ఆపరేషన్ తరువాత రోగులకు, శరీరం మీద నిలకడలేనివారికి, వికారం ఉన్నవారికి ఇచ్చే ఔషధాల తయారీలో ఈ డ్రగ్ వినియోగిస్తారు. అయితే ఈ డ్రగ్ సహజంగా లభించదు, ఉమ్మేత్తు పువ్వునుండి వచ్చే కొన్ని సహజ రసాయనాలు సేకరించి, దానికి మరికొన్ని రసాయనాలు కలపడం వలన ఈ స్కోపొలమైన్ అనే డ్రగ్ తయారవుతుంది.

సహజంగా ఉమ్మేత్తి పువ్వుకు ప్రజలను పిచోళ్ళని చేసే గుణం ఉంటుంది, ఒకప్పుడు వీటిని నూరి, పళ్లలో కలిపి ఇవ్వడం ద్వారా, వారికి మతిస్థిమితం తప్పి పిచ్చి పట్టేదని కథనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉమ్మేత్తు పువ్వు నుండి స్కోపొలమైన్ అనే సింథటిక్ తయారుచేస్తున్న, ఈ డ్రగ్ సుమద్ర మార్గాలు ద్వారా దేశంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని కొరియర్ సర్వీస్ల ద్వారా ఈ డ్రగ్ దేశ సరిహద్దులు దాటి లోపలికి వస్తుంది. మెక్సికోలోని కొన్ని డ్రగ్ గ్యాంగులు ఈ డ్రగ్ తయారుచేసి దేశమంతట రవాణా చేస్తున్నాయని నార్కోటిక్ కంట్రోల్ చీఫ్ కెమికల్ ఎక్సమినర్ డాక్టర్ దూలాల్ కృష్ణ సాహా తెలిచేసారు.

ఎంతో మంది నేరస్థులు, కిడ్నపర్లు ఈ డ్రగ్ ఉపయోగిస్తున్నారు. ఈ డ్రగ్ పౌడర్ మరియు ద్రవం రూపంలో లభిస్తుంది. మనిషి ముక్కుకు 5-6 ఇంచిలా దూరంలో ఈ పొడిని ఉంచినప్పుడు, ఈ పొడి వారి ముక్కు మరియు నోటిలోకి చేరుతుంది. ఈ డ్రగ్ ప్రయోగింపబడిన వ్యక్తులు 10 నిమిషాల్లో తమ ఆలోచనలు మీద పట్టు కోల్పొయి ఎదుటివారి ఆధీనంలోకి వెళ్తారు. ఈ పౌడర్ ను మొబైల్ స్క్రీన్ మీద మరియు విసిటింగ్ కార్డు మీద ఉంచి ఉపయోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని నిఘా సంస్థలు ఈ డ్రగ్ ఉపయోగించినట్లు ఉపయోగించేవారు. ప్రత్యధుల నుండి సమాచారం రాబట్టడానికి ఇంజక్షన్ రూపంలో ఈ డ్రగ్ ఇచ్చేవారు.

Share your comments

Subscribe Magazine