News

ఆకాశంలో రంగుల తుఫాను... భయబ్రాంతులకు గురైన ప్రజలు

KJ Staff
KJ Staff

ప్రపంచం ఎన్నో అద్భుతాలకు నిలయం. ఇటువంటి అద్భుతమే ఆకాశం ఉన్నటుంది కావడం. ప్రపంచంలో అనేక చోట్ల ఇప్పుడు ఈ వింత కనబడుతుంది. వీటిని చుసిన కొంత మంది జనం ఆనందంతో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే, మరికొంతమంది దీని వల్ల ప్రమాదం జరుగబోతున్నట్లు భావిస్తున్నారు.

ఆకాశం ఇలా రంగుల రంగులాగా కాంతిమయమవ్వడం నార్తర్న్ హేమిస్ఫెరే లో సర్వసాధారణం, వీటినే నార్తర్న్ లైట్స్ లేదా అరోరా బొరియలిస్ అని కూడా పిలుస్తారు. వీటిని చూడటానికి ఎంతో మంది ఈ ప్రాంతానికి సందర్శిస్తారు. చూడటానికి అందంగా కనిపించే ఈ నార్తర్న్ లైట్స్, భీకరమైన జామాగ్నిటిక్ తుఫాను. అయితే ఈ తుఫాను ద్వారా భూమి మీద ఉన్న ప్రజలకు ఎటువంటి హాని ఉండదు. 2003 లో ఈ పరిణామం చోటు చేసుకుంది.

నార్తర్న్ లైట్స్, లేదా అరోరా బొరియలిస్ రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి, ఇవి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తూ చుపురులను ఆకట్టుకుంటాయి. ఈ నార్తర్న్ లైట్స్ వివిధ రంగుల్లో, రిబ్బన్స్ లాగా కనిపిస్తాయి, ఇవి ఆకుపచ్చ, సింధూరం, గులాబీ రంగుల్లో ఏర్పడతాయి. సూర్యిని కిరణాలతో పాటు వచ్చే ధూళికణాలు(ఛార్జ్డ్ పార్టికల్స్) అంతరిక్షంలోని భూమి ఉపరితలాన్ని 7 కోట్ల కిలోమీటర్ల వేగంతో ఢీకోట్టినప్పుడు ఈ పరిణామం ఏర్పడుతుంది. భూమి ఉపరితలం మీద ఆక్సిజన్, నైట్రోజన్ వంటి వాయువులు ఉంటాయి, సూర్యుని నుండి వచ్చే ధూళికణాలు ఈ వాయుకణాలతో ఢీకొనడం ద్వారా ఈ వాయు కణాలు శక్తివంతంగా మారి, వీటిలోని పరమాణువులు వివిధ రంగులు సంతరించుకుంటాయి.

ఉత్తేజం చెందిన వాయు కణాలను బట్టి ఈ రంగులు ఉంటాయి. భూమి మీద సాధారణమైన వాయువు ఆక్సిజన్, ఈ అణువులతో ఢీకోట్టినప్పుడు ఆక్సిజన్ లోని పరమాణువులు పచ్చరంగును సంతరించుకుంటాయి. అదేవిధంగా నైట్రోజన్ వాయు కణాలు ఊద, నీలం, గులాబీ రంగులల్లో మెరుస్తాయి. మే 12 న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ నార్తర్న్ లైట్స్ కనిపించాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మోస్ఫెరిక్ అడిమినిస్ట్రేషన్ ప్రకారం 2003 తరువాత సంభవించిన వాటిలో ఇదే అతిపెద్ద కాంతి తుఫానని పేర్కొంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చుసిన ప్రజలు పలు సోషల్ మీడియా ప్లాటుఫామ్స్ లో ఫోటోలు షేర్ చేసి తమ ఆనందాన్ని తెలియచేసారు.

Share your comments

Subscribe Magazine