Health & Lifestyle

భారత దేశంలో నిషేధించబడిన ఆహార ఉత్పత్తులు ఏమిటో తెలుసా?

KJ Staff
KJ Staff

ప్రపంచంలో ఎక్కడలేనటువంటి విధంగా భారత దేశంలో వైవిధ్యం విరాజిల్లుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో, భారత దేశంలో అనేక మతాల వారు, కలిసికట్టుగా జీవించే దేశంలో. ఒక్క సంస్కృతిలోని కాదు ఆహార విధివిధానాల్లోనూ వైవిధ్యం ఉట్టిపడుతుంది.ప్రజలు తీసుకునే ఆహరం నాణ్యతను, మరియు ఆహారపదార్ధాల విక్రయాన్ని ఫుడ్ సాఫ్ట్య్ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. అయితే ప్రజల ఆరోగ్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆహార పదార్ధాలను మన దేశంలో నిషేధించారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చైనీస్ పాల ఉత్పత్తులు:

2008 వరకు భారత దేశంలో చైనీస్ పాల ఉత్పత్తులను మార్కెట్లో విరివిగా విక్రయించేవారు. వీటిలో చిన్న పిల్లలకు ఇచ్చే పాల పొడి దగ్గర నుండి, సాధారణ పాల ఉత్పత్తుల వరకు అన్ని ఉండేవి. అయితే ఈ చైనీస్ పాల్ ఉత్పత్తుల్లో ప్రోటీన్ శాతం పెంచి, చిక్కగా కనబడేందుకు మెలనిన్ అనే రసాయనాన్ని ఎక్కువుగా వాడే వారు. మెలానిన్ ఆరోగ్యానికి చాల ప్రమాదకరం. దీని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ పాల పదార్ధాలను భరత్ లో బ్యాన్ చేసింది.

జన్యు పరంగా మార్పు చెందిన ఆహారం:

మొక్కలోని జీన్స్ కొన్ని కుత్రిమ పద్ధతులు ఉపయోగించి మార్పుచేసినట్లైతే వాటిని జెనిటికెల్లి మాడిఫైడ్ ప్లాంట్స్ అంటారు. చాల దేశాల్లో ఇటువంటి మొక్కలను పెంచడం కానీ, వాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులను విక్రయించడం రెండు నిషిద్ధం. జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం తినడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కొందరి నమ్మకం, మరికొందరు వీటివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నమ్ముతారు. మన దేశంలో కూడా ఇటువంటి ఆహార పదార్ధాల మీద నిషేధం ఉంది. అయితే వాణిజ్య పరమైన పంటల్లో, జానూ పరంగా మార్పుచెందిన పత్తిని సాగుచేయడానికి అనుమతి ఉంది, ఇటువంటి పత్తిని బిటీ కాటన్ అని పిలుస్తాము.

పొటాషియం బ్రోమేట్:

బాకేరి కేకులు మరియు బ్రెడ్లు తయారీదారులకు పొటిషియం బ్రోమేట్ సుపరిచితమే. దీని ఎక్కువుగా బ్రెడ్ ల తయారీలో వాడేవారు. అయితే ఈ పొటిషియం బ్రోమేట్ అధికంగా తినడం వల్ల థైరాయిడ్ కాన్సర్ వచ్చే అవకాశం ఉంది . జంతువుల మీద జరిపిన పరిశోధనల్లో పొటాషియం బ్రోమాట్ వలన కాన్సర్ వస్తుందని నిరూపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ 2016 లో పొటాసియం బ్రోమాట్ బ్యాన్ చేసారు.

పళ్ళు పక్వానికి వచ్చేందుకు వాడే కుత్రిమ రసాయనాలు:

పండ్లను సుధూర ప్రాంతాలకు రవాణా చెయ్యడానికి, అవి పచ్చిగా ఉన్నపుడే కొయ్యవలసి ఉంటుంది. తరువాత మార్కెట్లో విక్రయించడానికి మాగబెట్టవలసి ఉంటుంది. ఇందుకోసం కుత్రిమ రసాయనాలను వినియోగిస్తారు, దీనికోసం వాడే కాల్షియమ్ కార్బైడ్, ఏతెలీనే గ్యాస్, ఆరోగ్యానికి హానికరమైనవి, ఈ రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రస్తుతం భారత దేశంలో వీటిని నిషేధించారు.

రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్:

టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసే సమయంలో, రెడ్ బుల్ ఆడ్ చూసే ఉంటారు. రెడ్ బుల్ ఒక ఎన్ఱజి డ్రింక్, దీనిలో ఉండే కెఫిన్, టౌరినే శరీరాన్ని ఉత్తేజపరిచి, ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తాయి. కెఫిన్ తీసుకోవడం శరీరానికి మంచిదే కానీ రెడ్ బుల్ డ్రింక్ లో కెఫిన్ పరిమితికి మించి ఉండటం వలన గుండె వేగం పెరగడం, బ్లడ్ ప్రెషర్ అధికమవ్వడం, తొందరగా డిహైడ్రాట్ అవ్వడం వంటివి జరగచ్చు కనుక, ఇండియా లో కొన్ని ఆంక్షలతో రెడ్ బుల్ విక్రయిస్తారు.

చైనీస్ వెలుల్లి:

చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న వెల్లులిలో అధిక శాతం పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని గుర్తించగా, వీటిని బ్యాన్ చెయ్యాలని ఆందళనలు చేసారు. దీనితో ఎఫ్ఎస్ఎస్ఏఐ 2019 నుండి చైనా నుండి వెల్లులి దిగుమతులు బ్యాన్ చేసారు. ఈ వెల్లులిలో పరిమితికి మించిన పురుగుమందులు ఉన్నందున, ప్రజల ఆరోగ్య భద్రత రీత్యా, భారత దేశంలో వీటిని విక్రయించడం నిషేధించారు.

కుందేలు మాంశం:

మతపరంగా వెల్లువెత్తుతున్న ఆందోళలను, జంతు సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని భారత దేశంలో కుందేలు మాంసాని నిషేధించారు. హిందువులు కుందేలు మాంసాని పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల ఇక్కడ కుందేలు మాంసాని తినడం
లేదా విక్రయించడం, రెండు నేరమే.

Related Topics

#Food #India #FSSAI #Ban

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More